వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంగళూర్ పేలుళ్ల అనుమానితుడి అరెస్ట్, గతంలో కూడా కేసు

|
Google Oneindia TeluguNews

కర్ణాటకలో గల మంగళూరులో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పేలుడు పదార్ధాలు నింపిన వ్యక్తిని మహ్మద్ షరీఖ్‌గా గుర్తించారు. అతనికి సిమ్ కార్డు అందించిన మరో నిందితుడిని ఊటీలో అరెస్ట్ చేశారు. నిందితుడు నకిలీ ఆధార్ కార్డు కలిగి ఉన్నాడని పోలీసులు గుర్తించారు.

5 కిలోల ప్రెషర్ కుక్కర్‌లో నిందితుడు పేలుడు పదార్దాలు నింపాడు. మంగళూరు రైల్వే స్టేషన్ నుంచి ఘటనా స్థలానికి అద్దెకు తీసుకున్న ఆటో రిక్షాలో వచ్చాడు. కోయంబత్తూరు, మంగళూరు ఘటనకు దగ్గరి పోలికలు ఉండటంతో ఎన్ఐఏ అధికారులు కేసుపై ఫోకస్ చేశారు. ఆటోలో లభించిన ఆధార్ కార్డు నకిలీదని పోలీసులు తేల్చారు.

మహ్మద్ షరిఖ్ ఇదివరకు అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపా కింద కేసు నమోదు చేశారు. ఆ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చారు. ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో పరారీలో ఉన్నారు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలను చేపట్టారు.

Mangaluru blast suspect identified

బ్లాస్ట్ జరిగిన సమయంలో ఆటోలో ప్రయాణిస్తోన్న వ్యక్తి ప్రేమ్ రాజ్ అని తొలుత అందరూ భావించారు. కానీ దర్యాఫ్తులో కాదని తేల్చారు. ఆధార్ కార్డులోని అడ్రస్‌తో హుబ్లీ వెళ్లిన పోలీసులకు ప్రేమ్ రాజ్ ఒక రైల్వే ఉద్యోగి అని తెలిసింది. పోయిన ఆధార్ కార్డు మరొకరు ఉపయోగిస్తున్నట్లు దర్యాఫ్తులో తేలింది.

తొలుత ఇది ప్రమాదవశాత్తు జరిగిన పేలుడుగా భావించారు. తర్వాత సిటీలో బ్లాస్ట్‌కు ప్లాన్ చేయగా, అది ముందే పేలిందని నిర్ధారించారు. ఎన్ఐఏ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించాయి. బాంబ్ బ్లాస్ట్ అయితే ఒక్కసారిగా మంగళూరు ఉలిక్కిపడింది. వెంటనే ఉగ్రవాద కోణంపై సందేహాలు తలెత్తాయి. దీంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు.

English summary
police have identified the blast suspect as Mohammed Shariq. Shariq had previously been booked under the Unlawful Activities (Prevention) Act (UAPA) for graffiti on walls in Mangaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X