షాకింగ్: దేశంలో సగం దొంగనోట్లు అక్కడే దొరికాయ్! ‘ఆ ’ఒక్క నోటును మాత్రం వదిలేశారు!
న్యూఢిల్లీ: గత ఏడాది పట్టుబడిన దొంగనోట్లలో సగం ఎక్కడ పట్టుబడ్డాయో తెలుసా? దేశ రాజధాని నగరం ఢిల్లీ, ఆ తరువాత గుజరాత్ రాష్ట్రంలో. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఒక నివేదికలో వెల్లడించింది.
2016లో అసలు ఒక్క నకిలీ నోటు కూడా పట్టుబడి రాష్ట్రం ఉంది. అది ఛత్తీస్‌గఢ్. అంతేకాదు, ఒక్క నోటు మాత్రం నకిలీ బారినుండి తప్పించుకుందట.. అది రూ.2 నోటు. ఈ విషయాలన్నింటినీ
ఎన్‌సీఆర్‌బీ తన నివేదికలో పేర్కొంది.

ఇంకో విషయం ఏమిటంటే.. గత ఏడాది పట్టుబడిన దొంగనోట్లలో 50 శాతం రూ.500 నోట్లే ఉండడం.
దేశవ్యాప్తంగా రూ.15.92 కోట్ల విలువైన దొంగనోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2.82 లక్షల నోట్లు పట్టుబడగా... అందులో 80 వేల వరకు రూ.1000 నోట్లు ఉన్నాయి.
ఈ నకిలీ నోట్లలో గతేడాది చివర్లో వచ్చిన రూ.2 వేల నోటు కూడా ఉంది. ఈ కొత్త నకిలీ నోట్లు 2272 వరకు పట్టుబడ్డాయట. వీటిలో అత్యధిక నోట్లు గుజరాత్‌లో పట్టుబడగా, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ తరువాతి స్థానంలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో ఒక్కో రూ.2 వేల నకిలీ నోటు దొరికింది. ఇక జమ్మూకశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో రెండు చొప్పున నకిలీ నోట్లు పట్టుబడగా, మణిపూర్, ఒడిషా రాష్ట్రాల్లో ఒక్కో దొంగ నోటును పట్టుకున్నారు.
అంతేకాదు, దేశవ్యాప్తంగా పోలీసులు, ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ.20 నకిలీ నోట్లు 184, 615 వరకు రూ.10 నకిలీ నోట్లు, నాణేలు.. రూ.5 నకిలీ నోట్లు 2001 వరకు స్వాధీనం చేసుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే.. దొంగ నోట్లు మాత్రమే కాదు,












Click it and Unblock the Notifications