వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెరువులోకి దూకి ఆరుగురి ప్రాణాలు కాపాడిన మంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఓ రాష్ట్ర మంత్రి చెరువులోకి దూకి ఆరుగురి ప్రాణాలు కాపాడిన సంఘటన కర్నాటక జిల్లాలో జరిగింది. మంగళవారం ఉదయం ప్రాథమిక, ఉన్నత విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ తన ఇన్నోవా కారులో తన సొంత ఊరైన తీర్థహల్లి నుండి బెంగళూరుకు వెళ్తున్నారు.

ఈ సమయంలో ఓ మారుతి స్విఫ్ట్ కారు మంత్రి కారును ఓవర్ టేక్ చేసి వెళ్లిపోయింది. మంత్రి కొద్ది దూరం వెళ్లాక తమను దాటుకుంటూ వెళ్లిన కారు బెగువల్లి చెరువులో మునిగిపోతూ కనిపించింది. కారులో ఆరుగురు కుటుంబ సభ్యులు చిక్కుకుపోయారు.

Minister jumps into lake, saves six from a sinking car

వెంటనే స్పందించిన మంత్రి రత్నాకర్ తన గన్‌మెన్, డ్రైవర్, ఎస్కార్టు వాహనం డ్రైవర్‌లతో కలిసి చెరువులోకి దూకారు. కారులో ఉన్న ఆరుగురు కుటుంబ సభ్యులను రక్షించారు.

డ్రైవర్ చంద్రశేఖర్ ఇతరులతో కలిసి నీళ్లలో మునిగిన కారు తలుపును తెరిచాడు. ముగ్గురు పిల్లలను బయటకు తీసుకు వచ్చాడు. ఆ తర్వాత మిగిలిన మరోసారి వెళ్లి మిగిలిన వారిని తీసుకు వచ్చాడు.

మంత్రి వెంటనే వైద్యుడికి ఫోన్ చేసి పిలిపించారు. వారికి పరీక్షల అనంతరం మందులు, ఫలహారం అన్నింటిని మంత్రి ఏర్పాటు చేశాడు. కాగా, స్టీరింగ్ లాక్ కావడంతో కారు చెరువులోకి వెళ్లిందని వారు చెబుతున్నారు.

English summary
There are very few, who think about others before themselves and on Tuesday primary and secondary education minister Kimmane Ratnakar did the same. He jumped into a lake and saved a family of six, who were trapped in a sinking car.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X