• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ విదేశీ టూర్లు లేనట్లే..! ఎందుకో.. ఎంతకాలమో?

|

ఢిల్లీ : కొత్త సంవత్సరంలో ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు దూరంగా ఉండబోతున్నారు. ఇప్పటివరకైతే మొదటి నాలుగు నెలల్లో ఎలాంటి షెడ్యూల్ ఫిక్స్ కాలేదు. దీనికి కారణం లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడటమే. జనరల్ ఎలక్షన్లపై దృష్టి సారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 నో ఫారిన్ టూర్స్..!

నో ఫారిన్ టూర్స్..!

ప్రధాని హోదాలో మోడీ 49 పర్యటనలకు గాను 59 విదేశాల్లో పర్యటించారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడానికి ఇప్పటికీ చాలా దేశాల్లో పర్యటించారు. అయితే 2019వ సంవత్సరంలో మోడీ ఏయే దేశాల్లో పర్యటిస్తారనే ఆసక్తి నెలకొంది. ఈనేపథ్యంలో న్యూ ఇయర్ లో మొదటి నాలుగు నెలలు ఆయన ఫారిన్ టూర్స్ కు వెళ్లే యోచన లేదు. 2019 మే నెలలో పార్లమెంట్ సాధారణ ఎన్నికలు ఉండటంతో విదేశీ టూర్లకు మోడీ దూరంగా ఉండబోతున్నారట.

ఏపీబీ-సీ ఓటరు సర్వే: మళ్లీ బీజేపీదే విజయం, మోడీయే ప్రధాని, ఇటీవల ఓడిన రాష్ట్రాల్లో కమలమే

 బీజేపీ ప్రచారకర్త.. అందుకే నో

బీజేపీ ప్రచారకర్త.. అందుకే నో

లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గరపడటంతో స్థానిక అంశాలపై దృష్టి పెట్టనున్నారు మోడీ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో బీజేపీ చతికిలపడటాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో అలాంటి సీన్ రిపీట్ కాకుండా పూర్తిస్థాయిలో నజర్ పెట్టనున్నట్లు సమాచారం. అందుకే విదేశీ పర్యటనలకు స్వస్తి చెప్పనున్నారనే టాక్ వినిపిస్తోంది.

అదలావుంటే బీజేపీకి అత్యంత ముఖ్యమైన ప్రచారకర్త మోడీ కావడం.. ఆయన ఛరిష్మా పార్టీకి పెద్ద శక్తిగా మారడం అందరికీ తెలిసిందే. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ కమలం వికసించేలా మోడీ కంకణం కట్టుకున్నారు. అందుకే కొత్త సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు విదేశీ పర్యటనలకు దూరంగా ఉండబోతున్నారు.

 ఆకర్షణ మంత్రం

ఆకర్షణ మంత్రం

విదేశీ పర్యటనలకు దూరంగా ఉండబోతున్నా.. ప్రజలను ఆకట్టుకోవడానికి దేశవ్యాప్తంగా మోడీ సుడిగాలి పర్యటన చేయనున్నట్లు సమాచారం. జనవరి 21-23 తేదీలలో వారణాసిలో జరగనున్న ప్రవాస భారతీయ దివాస్ ఉత్సవాల్లో పాల్గొంటారు. పార్టీ కార్యక్రమాలకు, ప్రచార వేదికలకు ఆయనే కీలకంగా మారడంతో విదేశీ పర్యటనలకు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు గ్రామీణ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్సుంది.

వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగ యువత ఇలా పలు అంశాలపై దృష్టి కేంద్రీకరించి ఓటర్లను ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేయడం మోడీ స్ట్రాటజీలో భాగం. ఇదంతా కూడా ఆచితూచి తీసుకోవాల్సిన నిర్ణయాలు. అంతేకాదు పెద్దఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది. అందుకే వీటన్నంటిని కూలంకషంగా పరిశీలించడానికే

ఫారిన్ టూర్లకు విరామం ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Modi is going to miss foreign tours in the new year. For the first four months, no schedule could be fixed. This is due to the Lok Sabha polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more