వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ లో చొరబాట్లకు 300మందికి పైగా ఉగ్రవాదులు సిద్ధం; ఇంటిలిజెన్స్ సమాచారంతో ఆర్మీ అలెర్ట్!!

|
Google Oneindia TeluguNews

భారతదేశానికి ఉగ్రవాదులతో ప్రమాదం పొంచి ఉందా ? భారతదేశంపై దాడులు చేయడానికి, అలజడి సృష్టించటానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి భారతదేశంలోకి ఉగ్రవాద మూకలు చొరబాట్లకు రెడీ అయ్యాయా?ఆఫ్ఘనిస్తాన్ మూలాలున్న ఉగ్రవాదులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల సహకారంతో భారత్ లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారా ? అంటే అవును అన్న సమాధానమే ఇంటిలిజెన్స్ వర్గాల నుండి వస్తోంది.

టెర్రరిస్టుల నుండి దేశాన్ని కాపడటం భద్రతా దళాలకు కత్తి మీద సామే

టెర్రరిస్టుల నుండి దేశాన్ని కాపడటం భద్రతా దళాలకు కత్తి మీద సామే


టెర్రరిస్టుల నుండి దేశాన్ని కాపాడటం భద్రతా బలగాలకు కత్తిమీద సాములా తయారైంది. నియంత్రణ రేఖ వద్ద పహారా కాస్తున్న భద్రతా దళాలు కఠినమైన శీతాకాలం ఉన్నప్పటికీ సరిహద్దులలో దేశాన్ని టెర్రరిస్టుల చొరబాట్ల నుండి రక్షించారు. ఇప్పుడు ఉత్తర కాశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాలలో మంచు కరుగుతున్నందున, ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించే అవకాశం ఉన్నందున, చొరబాట్లు అవకాశం ఉన్న ప్రాంతాలపై నిఘాను భద్రతా బలగాలు పెంచుతున్నాయి.

300 మందికి పైగా టెర్రరిస్టులు చొరబాట్లకు రెడీ.. ఇంటిలిజెన్స్ సమాచారం

300 మందికి పైగా టెర్రరిస్టులు చొరబాట్లకు రెడీ.. ఇంటిలిజెన్స్ సమాచారం


300 మందికి పైగా ఉగ్రవాదులు కాశ్మీర్ లోయను దాటేందుకు వివిధ టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లలో సరిహద్దు వెంబడి వేచి ఉన్నారని భద్రతా దళాలకు ఇన్‌పుట్‌లు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుండి చాలా మంది 'మతోన్మాద టెర్రరిస్టులను ' కాశ్మీర్‌కు పంపవచ్చని భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కరించడానికి భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నారు. ఆర్మీ మరియు బిఎస్ఎఫ్ యొక్క ఉన్నత స్థాయి అధికారులందరూ ఎల్‌ఓసికి ప్రత్యేక సందర్శనలు చేస్తూ గ్రౌండ్ జీరోలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మంచు కరగటం ప్రారంభం తర్వాత చొరబాట్లకు ప్లాన్ చేసిన టెర్రరిస్టులు

మంచు కరగటం ప్రారంభం తర్వాత చొరబాట్లకు ప్లాన్ చేసిన టెర్రరిస్టులు


జమ్ము కాశ్మీర్ లోని ఎత్తైన ప్రదేశాలలో మంచు కరగడం ప్రారంభించిన తర్వాత చొరబాట్లకు అవకాశం ఉన్న ప్రాంతాలపై నిఘాను పెంచుతున్నామని కశ్మీర్ ఫ్రాంటియర్ ఐజీ బీఎస్ఎఫ్ రాజాబాబు సింగ్ తెలిపారు. దాదాపు ఒక్కో లాంచింగ్ ప్యాడ్ లో 125-150 మంది ఉగ్రవాదులు చొరబాటు కోసం సరిహద్దు వెంబడి వేచి ఉన్నారని మా వర్గాలు చెబుతున్నాయి. ఆర్మీ మరియు బిఎస్ఎఫ్ ఉగ్రవాదులను మట్టుపెట్టి కాశ్మీర్ లోయలో పరిస్థితిని చాలా ప్రశాంతంగా మార్చాయి. మతోన్మాద టెర్రరిస్టులు సరిహద్దు దాటి చొరబాటుకు ప్రయత్నించే అవకాశం ఉంది అని, అందుకే తగిన వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని కశ్మీర్ ఫ్రాంటియర్ ఐజీ బీఎస్ఎఫ్ రాజాబాబు సింగ్ తెలిపారు.

 అన్ని సాంకేతిక పరికరాలతో బోర్డర్ లో నిఘా .. ఎల్ఓసి వెంట పెంచిన పెట్రోలింగ్

అన్ని సాంకేతిక పరికరాలతో బోర్డర్ లో నిఘా .. ఎల్ఓసి వెంట పెంచిన పెట్రోలింగ్


సరిహద్దులో కాపలా కాస్తున్న జవాన్‌లకు అధునాతన ఆయుధాలు, రాత్రిపూట నిఘాతో కూడిన నిఘా కెమెరాలు, డ్రోన్‌లు మరియు థర్మల్ ఇమేజింగ్ ట్రేసర్‌లతో కూడిన అన్ని కొత్త సాంకేతిక పరికరాలు అందించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్‌ను కూడా పెంచినట్టు వెల్లడించారు.తాము ఏడాది పొడవునా నియంత్రణ రేఖ వద్ద 24/7 కాపలాగా ఉన్నామని, ఈ ప్రాంతంలో చొరబాటుకు అవకాశం లేదని పేర్కొన్నారు. ఏ చొరబాటుదారుని భారత భూభాగంలోకి రానివ్వబోమని వెల్లడించారు. దేశంలోని పౌరులు సురక్షితంగా ఉన్నారని వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని భారత భద్రతా బలగాలు తేల్చి చెబుతున్నాయి.

 సైనికులకు కఠిన శిక్షణ; చొరబాటుదారులను గుర్తించే పనిలో భద్రతా బలగాలు

సైనికులకు కఠిన శిక్షణ; చొరబాటుదారులను గుర్తించే పనిలో భద్రతా బలగాలు


ఈ ఉన్నత ప్రాంతాల్లో నియమించబడిన సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది. ఈ ప్రాంతంలో శీతాకాలంలో 8-10 అడుగుల మంచు ఉంటుంది. వేసవిలో ఈ ఎత్తైన ప్రాంతాలలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. ఇది చాలా దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి, ఆ ప్రాంతంలో చొరబాటుదారులను గుర్తించేందుకు భద్రతా బలగాలు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే అటువంటి ప్రాంతాలలోనూ భద్రతా చర్యల కోసం సైనికులకు శిక్షణ ఇచ్చారు. ఎత్తైన ప్రాంతాలలో, తక్కువ ఆక్సిజన్ స్థాయిని కలిగి ఉన్న ప్రాంతాలలో, ముందుకు సాగడానికి కష్టమైన భూభాగాలను సైతం శిక్షణ పొందిన సైనికులు పహారా కాస్తున్నారు.

2022లో వివిధ ఎన్‌కౌంటర్లలో దాదాపు 40 మంది ఉగ్రవాదులు హతం

2022లో వివిధ ఎన్‌కౌంటర్లలో దాదాపు 40 మంది ఉగ్రవాదులు హతం


చలికాలంలో, నియంత్రణ రేఖ నుండి ఎటువంటి చొరబాట్లు జరగలేదు. సరిహద్దుల్లో నిఘా చాలా పటిష్టంగా ఉంది. ఉత్తర కాశ్మీర్‌లోని సరిహద్దు ఆవల నుండి ఎవరూ కాశ్మీర్ లోయకు వెళ్లలేకపోయారు. 2022లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో దాదాపు 40 మంది ఉగ్రవాదులు హతమైన జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను కూడా పెంచాయి.

పీఓకేలో నాలుగు లాంచింగ్ ప్యాడ్‌లు; మతోన్మాద ఉగ్రమూకకు చెక్ పెట్టే ప్లాన్ లో ఆర్మీ

పీఓకేలో నాలుగు లాంచింగ్ ప్యాడ్‌లు; మతోన్మాద ఉగ్రమూకకు చెక్ పెట్టే ప్లాన్ లో ఆర్మీ


ఉగ్రవాదుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాద సంస్థలు విసుగు చెందాయని, అందుకే మరింత మంది ఉగ్రవాదులను లోయలోకి పంపాలని భావిస్తున్నాయి అని వెల్లడించారు. పీఓకేలో నాలుగు లాంచింగ్ ప్యాడ్‌లు ఉన్నాయని, ఒక్కో లాంచింగ్ ప్యాడ్‌లో దాదాపు 125-130 మంది ఉగ్రవాదులు కాశ్మీర్ లోయను దాటేందుకు సిద్ధంగా ఉన్నారని వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎవరిని భారత్ లో అడుగు పెట్టినిచ్చేది లేదని తేల్చి చెబుతున్న భద్రతా బలగాలు దేశ రక్షణ కోసం రేయింబవళ్ళు పహారా కాస్తామని చెబుతున్నారు.

English summary
The Army was alerted by intelligence input that more than 300 terrorists were ready at various launch pads to enter Kashmir. With this army Increased patrols along the borders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X