వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గేదె పాలివ్వడం లేదు.. సాయం చేయండి పోలీసు సార్లు.. కంప్లైంట్..

|
Google Oneindia TeluguNews

అప్పుడప్పుడు వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. అవును కొన్ని కొన్ని ఘటనలు నవ్వు తెప్పిస్తుంటాయి. వారి అమాయకత్వమో.. తెలియనితనమో తెలియదు కానీ.. కాస్త వింతగా అనిపిస్తాయి. అలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. సినిమాల్లో కొన్ని కామెడీ సనిమాల్లో మా ఇల్లు తప్పిపోయిందని, ఓ చిన్న పిల్లాడు తన పెన్సిల్‌ దారిపోయిందని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సన్నివేశాలను మనం చూసుంటాం. ఈ తరహాలోనే తాజాగా ఓ వ్యక్తి తన గేదె పాలు ఇవ్వడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మధ్యప్రదేశ్‌లోని బింద్‌ జిల్లాలో ఘటన జరిగింది. బాబూలాల్ జాతవ్ శనివారం నయాగావ్ పోలీస్ స్టేషన్‌కు తన గేదెను తీసుకెళ్లాడు. పోలీసులతో తన గేదె కొన్ని రోజులుగా పాలు ఇవ్వడం లేదని, పాలు కూడా తనని పితకనివ్వడం లేదని తెలిపాడు. తన గేదెకు గ్రామంలో ఎవరో చేతబడి చేశారని, అందుకే పాలు ఇచ్చేందుకు అది నిరాకరిస్తోందని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దరఖాస్తు ఇచ్చిన నాలుగు గంటల తర్వాత ఆ రైతు మళ్లీ తన గేదెతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు.

 MP farmer goes to police after buffalo refuses to be milked

తన గేదె పాలు ఇచ్చేలా తనకు సహాయం చేయాలని కోరాడు. దీంతో పోలీసులకు అతనికి ఒక పశువైద్యుడి వద్దకు ఆ గేదెను పంపారు. చివరకు తన గేదె పాలు ఇవ్వడంతో ఆదివారం ఉదయం పోలీసుల వద్దకు వెళ్లి అతను ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఆ వ్యక్తి తన గేదెతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 'చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతకడం అంటే ఇదే' అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనని వారికి థాంక్స్‌ చెప్తున్నారు.

Recommended Video

రైతులకు అన్యాయం జరిగితే సహించమన్న భట్టి విక్రమార్క || Oneindia Telugu

ఆ రైతు నేరుగా పశు వైద్యుడిని కలిస్తే సరిపోయేది. కానీ పోలీసులను ఆశ్రయించడంతో వైరల్‌గా మారింది. వారు కూడా ఓపికగా విని.. పశువుల డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో అతను చూసి.. సమస్యను పరిస్కరించారు. దీంతో రైతు సంతోష పడ్డాడు. పోలీసులకు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది. లేదంటే రైతు మరోసారి వచ్చేవారు.

English summary
farmer from Bhind in Madhya Pradesh has approached the police with a most unusual complaint his buffalo’s “refusal” to be milked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X