మీసం పెంచారని కొట్టారు: స్టైల్‍గా మీసం తిప్పుతున్న 'మిస్టర్ దళిత్'
ఇటీవల గుజరాత్‌లో మీసాలు పెంచినందుకు ఇద్దరు దళిత యువకులపై రాజ్‌పుత్‌లు దాడి చేశారు. వారిని తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన గాంధీనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.
అహ్మదాబాద్: ఇటీవల గుజరాత్‌లో మీసాలు పెంచినందుకు ఇద్దరు దళిత యువకులపై రాజ్‌పుత్‌లు దాడి చేశారు. వారిని తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన గాంధీనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో స్థానిక దళిత యువకులు వినూత్న నిరసన చేపట్టారు. తమ మీసాలను స్టైలుగా తిప్పుతూ దళిత యువకులు నిరసన తెలుపుతున్నారు.

రాజ్‌పుత్‌లు అహంకారంతో ప్రవర్తించినా తాము మీసాలు తిప్పటం ఆపబోమని దళిత యువకులు తేల్చి చెప్పారు. వారు కొడితే తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.
అంతేకాదు, వాట్సాప్‌లో 'మిస్టర్ దళి' అనే గ్రూప్ క్రియేట్ చేసి మీం మెలేస్తున్న ఫోటోలను పెడుతున్నారు. తప్పు చేస్తే కొట్టినట్లుగా మీసం మెలేస్తే కొట్టడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. కాగా, గుజరాత్ పోలీసులు మాత్రం దళిత యువకులపై దాడి చేసిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications