ఏడు అంతస్తుల నుంచి దూకి ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య, యువకుడిది ఆంధ్రా, చదువులో ఫస్ట్!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: జీవితంపై విరక్తి పెంచుకున్న ఐఐటీ విద్యార్థి ఏడు అంతస్తుల భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీలోని ఐఐటీ కాలేజ్ హాస్టల్ ఏడు అంతస్తుల పైనుంచి దూకి సాయిశరత్ (22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయిశరత్ అలియాస్ సాయిశరత్ రెడ్డి బెంగళూరులోని ఐఐటీ కాలేజ్ లో నాలుగో సంవత్సరం ఎంటెక్ చదువుతున్నాడు. సాయిశరత్ తండ్రి కోదండరెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఆదాయపన్ను శాఖలో అధికారిగా పని చేస్తున్నారు.

MTech student commited suicide to jumps on 7th floor in Bengaluru

శుక్రవారం వేకువ జామున 5 గంటల సమయంలో శాయిశరత్ ఐఐటీ కాలేజ్ హాస్టల్ ఏడో అంతస్తు మీదకు వెళ్లి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గుర్తించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. సాయిశరత్ చదవులో ముందున్నాడని, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలీదని సాటి స్నేహితులు చెబుతున్నారని, విచారణ చేస్తున్నామని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MTech student commited suicide to jumps on 7th floor in Bengaluru in Karnataka.
Please Wait while comments are loading...