వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జుమ్లాస్ అవసరం లేదు: కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని పరిష్కరించడానికి ఇంధనం, గ్యాస్‌పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత.. ప్రభుత్వం తన మంత్రుల ద్వారా రాష్ట్రాలు తమ పన్నులను తగ్గించడానికి రాష్ట్రాలపై ఒత్తిడిని ప్రారంభించింది. రాష్ట్రాలు కూడా తమ వంతుగా పన్నులు తగ్గిస్తే ప్రజలపై భారం మరింత తగ్గుతుందని మంత్రులు సూచిస్తున్నారు.

ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి "ధరలను తగ్గించడానికి కొన్ని రాష్ట్రాలు నిరాకరించడం" పై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఇతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ఈ తగ్గింపు చాలా తక్కువ అని, కేంద్రం ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. "ప్రజలను మోసం చేయడానికి దేశానికి అంకెల గారడీ అవసరం లేదు' అని సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. అంతేగాక, 60 రోజుల క్రితం గణాంకాలను, 2014 రేట్లను చూపుతూ అన్నారు.

Nation doesn’t need “Jumlas”: As Centre Cuts Fuel Prices, Congress Does The Math

పెట్రోల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ. 8 తగ్గించినందున, డీజిల్‌పై లీటరుకు రూ. 6 తగ్గించినందున పెట్రోల్ ధర రూ. 9.5 తగ్గుతుందని, డీజిల్‌పై రూ. 7 తగ్గుతుందని తెలియజేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలతో పోలిస్తే అనేక రాష్ట్రాల్లో ఇంధన ధరలు రూ. 10-15 ఎక్కువగా ఉన్నాయని కేంద్రమంత్రి పూరీ ఎత్తిచూపారు.

"సెంట్రల్ ఎక్సైజ్‌లో ఈ 2వ తగ్గింపు ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ వంటి రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే ₹ 10-15 అధికంగా ఉన్నాయని.. నేను ఆ వాస్తవాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను' అని కేంద్రమంత్రి ట్వీట్ చేశారు.

వ్యాట్‌ను తగ్గించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరించడం వల్లనే ధరల వ్యత్యాసం ఏర్పడిందని కేంద్రమంత్రి అన్నారు. "ఈ రాష్ట్రాలు తమ వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి మేల్కొలపడానికి, వ్యాట్ తగ్గించడానికి సమయం ఆసన్నమైంది' అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా ఈ ప్రకటనపై వెంటనే స్పందిస్తూ.. "జుమ్లాస్" అని వాటిని దూషిస్తూ.. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని మే 2014లో పెట్రోల్‌పై లీటరుకు ₹ 9.48, డీజిల్‌పై ₹ 3.56 స్థాయిలకు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

'ప్రియమైన కేంద్రఆర్థికమంత్రి,
మే 2014లో,
పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ = ₹ 9.48/లీటర్
21 మే, 2022న,
పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ = ₹ 27.90/లీటర్
మీరు ఇప్పుడు ₹ 8 తగ్గించారు.
మీరే పెట్రోల్‌పై ఎక్సైజ్‌ని ₹ 18.42/లీటర్‌కు పెంచింది, ఇప్పుడు దానిని ₹ 8/లీటర్‌కు తగ్గించింది.

కాంగ్రెస్ సమయంలో ఇది ఇప్పటికీ ₹ 19.90 V/S ₹ 9.48, "అని రణదీప్ ఆర్థిక మంత్రిని ఉద్దేశించి చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు.

కాగా, 'నేను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, ముఖ్యంగా చివరి రౌండ్‌లో (నవంబర్ 2021) తగ్గింపు చేయని రాష్ట్రాలను కూడా ఇదే విధమైన కోతను అమలు చేసి సామాన్యులకు ఉపశమనం కలిగించాలని కోరుతున్నాను' అని సీతారామన్ విజ్ఞప్తి చేశారు.

English summary
Nation doesn’t need “Jumlas”: As Centre Cuts Fuel Prices, Congress Does The Math.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X