వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీలక మలుపు: నేడు సీఎంగా నితీష్ ప్రమాణం, చక్రం తిప్పిన మోడీ!

బీహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బుధవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ గురువారం సాయంత్రం తిరిగి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

|
Google Oneindia TeluguNews

పాట్నా/న్యూఢిల్లీ: బీహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బుధవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ గురువారం సాయంత్రం తిరిగి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

చదవండి: ట్విస్ట్, లాలు ఉలిక్కిపాటు: మళ్లీ నితీషే సీఎం? బయటి నుంచి బిజెపి మద్దతు

బిజెపి మద్దతుతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇది బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు. నిన్నటి దాకా గ్రాండ్ అలయెన్స్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్, జెడియు, ఆర్జేడీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

చదవండి: ప్రభుత్వాన్ని నడపడం కష్టంగా ఉంది: నితీష్ సంచలనం, ప్రశంసించిన మోడీ

ఇప్పుడు బిజెపి-జెడియు ప్రభుత్వం ఏర్పడుతోంది. నితీష్ నివాసంలో జెడియు - బిజెపి ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బిజెపి అధిష్టానం సూచనతో ఎమ్మెల్యేలు నితీష్‌కు మద్దతిస్తున్నారు.

గంటల్లోనే బిజెపి దరి చేరినా..

గంటల్లోనే బిజెపి దరి చేరినా..

రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే నితీష్ కుమార్ బిజెపి దరి చేరారు. అయితే అంతకుముందే దోస్తీ అంశంపై ప్రధాని మోడీ, అమిత్ షాలు కలిసి చక్రం తిప్పారని, నితీష్‌కు మద్దతిస్తామని చెప్పడంతో ఆయన రాజీనామా చేసి, తిరిగి గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.

ఏం జరిగినా..

ఏం జరిగినా..

ఒకవేళ ముందు చర్చలు జరగలేదని చెప్పినా కూడా.. నితీష్ రాజీనామా అనంతరం మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం ఇష్టం లేదని చెబుతూ ఆయనకు మద్దతు ఇస్తామని చెప్పడం వ్యూహాత్మకమే అంటున్నారు. కానీ గత కొద్దికాలంగా నితీష్ బిజెపికి దగ్గరవడం చూస్తుంటే, ముందు చర్చలు జరిగి ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చాలా రోజలుగా విభేదాలు

చాలా రోజలుగా విభేదాలు

ఎప్పటి నుంచో గ్రాండ్ అలెయన్స్‌లో విభేదాలు ఉన్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. కానీ సిబిఐ దాడుల అనంతరం నితీష్ ఆగ్రహంతో ఉన్నారు. వివరణ కోరినప్పటికీ లాలూ నుంచి స్పందన లేదు. సిబిఐ దాడుల ఎఫెక్ట్‌తో తనకున్న క్లీన్ ఇమేజ్ కాపాడుకుననేందుకు నితీష్.. లాలూకు దూరమయ్యారు.

సిబిఐ దెబ్బ

సిబిఐ దెబ్బ

సిబిఐ దాడుల నేపథ్యంలో పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఐదేళ్లు కలిసి నడవాలనుకున్న గ్రాండ్ అలయెన్స్ వ్యూహానికి మోడీ గండి కొట్టారని అంటున్నారు. వారి ఐక్యతను మోడీ - షాల ధ్వయం రెండేళ్లలోనే దెబ్బతీసిందంటున్నారు.

English summary
After getting BJP's support, Nitish Kumar, who had resigned from Chief Minister's post on Wednesday, will be sworn-in as state's CM at 5 pm on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X