వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20వ తేదీ వచ్చిన 20 శాతం మందికి జీతాలు ఇవ్వలె, ఏపీ సర్కార్‌పై రఘురామ ఫైర్

|
Google Oneindia TeluguNews

సమయం దొరికితే చాలు ఏపీ సర్కార్‌పై విరుచుకుపడుతుంటారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు. ప్రతీ రోజు ఏదో ఒక అంశంపై ఏపీ ప్రభుత్వ విధానాలను తప్పుపడుతుంటారు. ఇవాళ ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తావించారు. ఆర్థిక పరిస్థితితోపాటు ఇతర అంశాలపై రఘురామకృష్ణరాజు స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిందని కామెంట్ చేశారు. సంక్షేమం పేరుతో సంక్షోభం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి సంక్షేమం ఎక్కువకాలం నిలవదని అభిప్రాయపడ్డారు.

20 శాతం మంది

20 శాతం మంది

ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేయకుండా, ఉద్యోగుల పీఎఫ్‌లో కోత విధిస్తోందని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. 20వ తేదీ వచ్చినప్పటికీ ఇంకా 20 శాతం మందికి వేతనాలు చెల్లించలేదని అన్నారు. జగన్ సర్కారు అధికారం చేపట్టాక రూ.2.56 లక్షల కోట్లు అప్పు చేశారని గుర్తుచేశారు. రుణాలు తెచ్చుకోవడం కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకే ఆదాయం అంతా సరిపోతోందని వివరించారు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి పప్పుబెల్లాల్లా పంచుతున్నారని రఘురామ విమర్శించారు.

ఆదాయం పెంచే మార్గాలు..

ఆదాయం పెంచే మార్గాలు..


ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వం కలెక్టర్లకు చెప్పడం ఏంటి అని రఘురామ ప్రశ్నించారు. కలెక్టర్లు ఆదాయ మార్గాలు ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తారా అని అడిగారు. ఇటు రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనం స్త్రీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆక్రోశించారు. "గన్ కన్నా ముందు ఇంకేదో గన్ వస్తుందని మహిళా మంత్రులు చెబుతున్నారని సెటైర్లు వేశారు. చట్టాలు కూడా తెచ్చి.. యాప్ పెట్టాం అని మాట్లాడుతున్నారు. కానీ స్త్రీలపై దాడులు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

మంత్రులు ఇలా

మంత్రులు ఇలా


మంత్రుల తీరుపై రఘురామ కృష్ణరాజు విమర్శలు చేశారు. సీఎం జగన్ వస్తేనే మంత్రులు సచివాలయానికి వస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ సచివాలయంలో అందుబాటులో ఉండాలని కోరుతున్నామని తెలిపారు. మరో పాతికేళ్లు వైసీపీనే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నానని తన మనసులోని మాటను బయటపెట్టారు. కానీ ఆయన సెటైరికల్‌గా అన్నారని ఈజీగానే అర్థం అవుతోంది. అధికార పార్టీలో పంటికింద రాయిలా తయారయ్యారు. ఆయన పీడ వదిలించుకోవాలని జగన్ ప్రభుత్వం తనవంతు ప్రయత్నం చేస్తోంది. అనర్హత వేటు గురించి స్పీకర్‌కు ఇప్పటికే పలుమార్లు లేఖలు కూడా రాశారు.

అనర్హత

అనర్హత


ఒకానొక క్రమంలో స్పీకర్‌పై వైసీపీ నేతలు ఆరోపణలు కూడా చేశారు. ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. అనర్హత వేటు వేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని ఫైరయ్యారు. స్పీకర్‌పై బహిరంగంగానే కామెంట్స్ చేశారు. దీనిని రఘురామ తప్పుపట్టారు. అయితే రఘురామ బీజేపీ నేతలు/ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా మెలగుతున్నారు. తరచుగా మోడీ, అమిత్ షాతో భేటీ అవుతారు. ఆయన దాదాపు ఢిల్లీలోనే ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ రాగా.. ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. తర్వాత ఏపీకి తరలించడం.. హైదరాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించిన సంగతి తెలిసిందే.

English summary
20th of this month gone but andhra pradesh government not pay 20 per cent employees salaries ysrcp rebel mp raghurama krishna raju alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X