కలకలం: ముంబై విమానాశ్రయానికి ఐసిస్ బెదిరింపు, కార్గో విమానంలో హెచ్చరిక లేఖ
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విధ్వంసానికి పాల్పడతామంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ హెచ్చరించింది. దీనికి సంబంధించి ఓ లేఖ నిఘా వర్గాలకు అందింది.
న్యూఢిల్లీ : ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విధ్వంసానికి పాల్పడతామంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ హెచ్చరించింది. దీనికి సంబంధించి ఓ లేఖ నిఘా వర్గాలకు అందింది.
ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే భద్రతాధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. విమానాశ్రయంలోపల, బయట పరిసరాల్లో అణువణువూ గాలించారు. బాంబు నిర్వీర్య దళం, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది తనిఖీలు చేశారు.

ముంబై విమానాశ్రయ అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ టాయ్‌లెట్‌లో ఓ నోట్ కనిపించింది. 2018 జనవరి 26న కార్గోపై ఐసిస్ ఉగ్రవాద సంస్థ దాడి జరుపుతుందని ఆ లేఖలో ఓ హెచ్చరిక ఉంది.
ఈ నేపథ్యంలో కార్గోను ఖాళీ చేయించామని, స్క్రీనింగ్ తర్వాతే ప్రయాణికులను లోపలికి అనుమతిస్తున్నామని భద్రతాధికారులు తెలిపారు. ప్రయాణికుల లగేజిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications