వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్‌లోనూ మాస్టర్ సచిన్ టెండూల్కర్‌దే రికార్డు

|
Google Oneindia TeluguNews

ముంబై: క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరున లిఖించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇప్పుడు సొషల్ నెట్‌వర్క్ ట్విట్టర్‌లో ఓ కొత్త రికార్డును సృష్టించారు. 2010లో సచిన్ టెండూల్కర్ ట్విట్టర్‌లో ప్రవేశించారు. అయితే 2013 నవంబర్ 13న సచిన్ ఓ సందేశం పోస్టు చేశాడు. అదేంటంటే.. 24ఏళ్ళుగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు అని.. తన 3.8 మిలియన్ల అభిమానులకు ట్వీట్ చేశాడు.

తను అభిమానుల మద్దతు వల్లే ఇన్నేళ్లపాటు బాగా ఆడగలిగానని సచిన్ అందులో పేర్కొన్నాడు. అయితే నవంబర్ 15 మధ్యహ్యం నాటికి 9,574 రీట్వీట్లు వచ్చాయి. కాగా మరో 5,824 మంది ఈ సందేశాన్ని ఫేవరేట్‌గా పరిగణించారు. ఈ సంఖ్య అనేది భారతదేశంలో ఓ కొత్త రికార్డును సృస్టించింది. సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన సందేశానికి అత్యధిక సంఖ్యలో రీ ట్వీట్లు వచ్చాయని, భారతదేశంలో ఇదొక రికార్డని ట్విట్టర్ నిర్వాహకులు శుక్రవారం పేర్కొన్నారు.

Sachin Tendulkar

ముంబైలోని వాంఖేడే స్టేడియంలో వెస్టిండీస్ జట్టుతో గురువారం ప్రారంభమైన రోజునే మాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. నవంబర్ 15, 1989లో టెస్ట్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ అరంగేట్రం చేశాడు. అయితే ఆ సమయంలో ట్విట్టర్ గానీ, ఫేస్‌బుక్ గానీ లేవు. కాగా తన 200వ టెస్ట్ మ్యాచులో సచిన్ టెండూల్కర్ 74 పరుగులతో రాణించాడు.

40ఏళ్ల మాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ప్రస్తుతం 38,42,233 మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి థాంక్యూ సచిన్ పేరుతో ప్రారంభించిన ఓ సందేశాద్యోమం ప్రస్తుతం 18,03,388 ట్వీట్లను మోసుకెళుతోంది. మాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌లోనే కాకుండా ట్విట్టర్‌లో కూడా ఈ రకంగా రికార్డులు సృష్టిస్తున్నారు.

English summary
It is a known fact that Sachin Tendulkar sets records on the cricket field. But, the Master Blaster has now achieved another milestone on a different platform - off the field and on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X