• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏమీ నిర్లక్ష్యం.. మాటల్లో పడి వృద్దురాలికి రెండుసార్లు వ్యాక్సిన్

|

కరోనా వైరస్ నివారణ టీకాతోనే సాధ్యం. దీంతో తొలుత నిరాకరించిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే కరోనా భయంతో టీకా తీసుకోవడానికి వచ్చిన వృద్ధురాలు ఆస్పత్రిపాలైంది. నర్సు నిర్లక్ష్యం వల్లే ఆమె అలా ఆస్పత్రిలో పడినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని కడలూరు జిల్లా పెన్నాడం ప్రాంతంలో సుబ్రహ్మణ్యం, లక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. ఆరోగ్యకేంద్రానికి వచ్చిన లక్ష్మి.. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఆమెకు ఒకసారి ఇంజెక్షన్ చేసిన నర్సు.. పక్కనే ఉన్న సహచరులతో మాటల్లో పడి ఆ విషయం మర్చిపోయింది. ఆ వెంటనే మరోసారి లక్ష్మికి టీకా ఇచ్చింది. తనకు రెండుసార్లు వ్యాక్సిన్ ఎందుకిస్తున్నావని లక్ష్మి అడుగుతున్నా కూడా సదరు నర్సు పట్టించుకోలేదు. ఇలా రెండు సార్లు వ్యాక్సిన్ తీసుకోవడంతో లక్ష్మి శరీరం తట్టుకోలేకపోయింది. దీంతో ఆమె స్పృహతప్పింది. అయితే తాను ఒక వ్యాక్సిన్ మాత్రమే ఇచ్చానని సదరు నర్సు బుకాయిస్తోంది. కానీ లక్ష్మి చేతిపై రెండు చోట్ల రక్తం రావడాన్ని అధికారులు గుర్తించారు. ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్పించి నిపుణుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ విషయం తెలిసిన ఆరోగ్యశాఖ అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

 nurse Neglected while giving vaccine

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

  వినాయక విగ్రహాల ధరలతో బెంబేలెత్తుతున్న భక్తులు!!

  ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరించి.. శాని టైజర్ రాసుకొని కాలం వెళ్లదీయాల్సిందేనని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.

  English summary
  a nurse Neglected while giving vaccine. shots given vaccine two times a old lady.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X