బద్రీనాథ్‌లో కూలిన హెలికాప్టర్: ఇంజినీర్ మృతి, క్షేమంగా పైలట్లు, ప్రయాణికులు
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లో శనివారం ఉదయం హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి హరిద్వార్‌కు భక్తులను తీసుకొని వెళ్తూ కుప్పకూలిపోయింది.
బద్రీనాథ్: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లో శనివారం ఉదయం హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి హరిద్వార్‌కు భక్తులను తీసుకొని వెళ్తూ టేకాఫ్ సమయంలో కుప్పకూలిపోయింది. ఎనిమిది మందితో వెళ్తున అగస్టా 119 హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో ఒకరు మృతి చెందారు.
ఈ హెలికాప్టర్‌లో మొత్తం ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, ఒక ఇంజినీరు ఉన్నారు. ప్రమాదంలో ఇంజినీరు ప్రాణాలు కోల్పోగా.. పైలెట్లు స్వల్పంగా గాయపడ్డారు. కాగా, ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారని డీజీసీఏ అధికారులు తెలిపారు.

ప్రమాదాన్ని పరిశీలించేందుకు విచారణ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇంజినీరు కుటుంబానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సంతాపాన్ని తెలియజేశారు. హెలికాప్టర్ ప్రమాదం తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసిందని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications