ఎన్నికల వేళ తమిళ రాజకీయాల్లో సంచలనం, మారుతున్న లెక్కలు...!!
తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం. అసెంబ్లీ ఎన్నికల వేళ సమీకరణాలు వేగంగా మారుతు న్నాయి. తమిళనాడులో ఎలాగైనా ఈ సారి సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ అన్నా డీఎంకేతో జత కట్టింది. అటు డీఎంకే తిరిగి తమదే అధికారం అనే ధీమాతో ఉంది. సినీ హీరో విజయ్ రాజకీయంగా తొలి అడుగులోనే సక్సెస్ రేట్ నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో సీఎం స్టాలిన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తిరిగి అధికారమే లక్ష్యంగా వేస్తున్న అడుగులు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమిళనాడులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నా డీఎంకేతో జత కట్టటం ద్వారా తమిళనాడులో బలం పెరుగుతుందని బీజేపీ నేతలు కొత్త లెక్కలు వేసారు. అటు విజయ్ చీల్చే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో కలిసి వస్తుందని భావించారు. ఇటు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కొత్త నిర్ణయాలు అమలు చేస్తున్నారు. రాజకీయంగా.. ప్రత్యర్థుల పైన సైలెంట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. తాజాగా మాజీ ముఖ్య మంత్రి.. అన్నా డీఎంకే వాలంటీర్ల హక్కుల పునరుద్ధరణ కమిటీ సమన్వయకర్త O. పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసారు. ఇద్దరూ ఒన్ టు ఒన్ సమావేశం అయ్యారు. సుదీర్ఘంగా సాగిన భేటీలో ఎన్నికలు... ప్రస్తుత పరిస్థితులు.. భవిష్యత్ వ్యూహాల పైన చర్చించారు. స్టాలిన్ పాలన బాగుందని.. తిరిగి డీఎంకే అధికారంలోకి వస్తుందని పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతున్నాయి.

ఎన్నికల పొత్తుల వేళ మారుతున్న లెక్కలు
పన్నీర్‌సెల్వం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం స్టాలిన్‌ను స్వయంగా కలవటం.. ఆయన పాలనను ప్రశంసించటం ద్వారా రాజకీయంగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషణలు మొదలు అయ్యాయి. స్టాలిన్-ఓపీఎస్ సమావేశం తర్వాత, ఓపీఎస్ డీఎంకే పార్టీలో చేరబోతున్నారా అనే ప్రశ్న తలెత్తింది. ఓపీఎస్ మద్దతుదారులు ఒక్కొక్కరుగా ఆయనను వదిలిపెడుతున్నందున, ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన ఒక ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా.. డీఎంకే ఐదేళ్ల పాలనను పొగిడిన పన్నీర్‌సెల్వం.. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ డీఎంకే గెలుస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీని ద్వారా ఇక పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరటం లాంఛనంగానే మారుతోంది. అటు విజయ్ కొత్తగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. డీఎంకే, ఎన్డీఏ రాజకీయ వ్యూహాలను జాగ్రత్తగా గమనిస్తూ.. అభ్యర్దుల ఖరారు పైన ఫోకస్ చేసారు. దీంతో.. ఎన్నికల ముందే రాజకీయంగా రాష్ట్రంలో ఉత్కంఠ కొనసాగుతోంది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications