మధ్యప్రదేశ్‌లో రాత్రి 10 గంటల సమయంలో పట్టాలు తప్పిన రైలు

Posted By:
Subscribe to Oneindia Telugu

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. సల్హానా నుంచి పిపారియా కలాన్ స్టేషన్ల మధ్య కట్నీ - చౌపాన్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం పట్టాలు తప్పింది.

ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. కట్నీ రైల్వే స్టేషన్‌కు 30 కిలో మీటర్ల దూరంలో దాదాపు రాత్రి పది గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

విషయం తెలియగానే సంఘటన స్థలానికి రిలీఫ్ ట్రెయిన్ చేరుకుందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ వీరేంద్ర సింగ్ వెల్లడించారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Five coaches of the Katni-Chaupan passenger train derailed yesterday between the Salhna and Piparia Kalan stations in Madhya Pradesh, leaving at least six people injured, a railway official said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X