మోదీ అనూహ్యం:పొలిటిక్ అఫైర్స్ ప్యానెల్‌లోకి స్కృతి ఇరానీ -కేబినెట్ కమిటీల్లో ప్రధాని మార్కు మార్పులు
ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే బలహీనపడిన కాంగ్రెస్ పార్టీని దాదాపు చావుదెబ్బ కొట్టి, ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీనే ఓడించిన స్మృతి ఇరానీ ఇప్పటికే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కాగా, ఇంకొద్ది నెలల్లోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ఇరానీకి అధిక ప్రధాన్యం కల్పిస్తూ, అనూహ్య రీతిలో ఆమెను కేంద్ర కేబినెట్ పొలిటికల్ వ్యవహారాల కమిటీలోకి తీసుకున్నారు.
కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయిన వారం రోజులకు కేబినెట్ కమిటీలను సైతం పునర్వ్యవస్థీకరించారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్త, పాత మంత్రులతో మార్పులు చేసిన కేబినెట్ కమిటీల వివరాలు మంగళవారం వెలువడ్డాయి. ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తోన్న, అత్యంత ప్రాధాన్యం ఉండే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీలోకి కొత్తగా స్మృతి ఇరానీ, భూపేంద్ర యాదవ్, వీరేంద్రకుమార్, గిరిరాజ్‌సింగ్, అర్జున్ ముండా, శర్వానంద సోనోవాల్, మన్‌సుఖ్ మాండవీయకు చోటు కల్పించారు.

రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీలోకి అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, వీరేంద్ర కుమార్‌లను తీసుకున్నారు. పదవులు కోల్పోయిన రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావదేకర్ స్థానంలో అనురాగ్, కిరణ్ లకు చోటు కల్పించారు. నైపుణ్య వ్యవహారాల కేబినెట్ కమిటీలోకి ఆర్సీపీ సింగ్, అశ్వనీ చౌబే, భూపేంద్రయాదవ్, కిషన్‌రెడ్డిలను ప్రధాని మోదీ నియమించారు. మార్పులు చోటచేసుకున్న అన్ని కమిటీల్లోనూ భూపేంద్ర యాదవ్ కు చోటు దక్కడం విశేషం. ఇక,
దేశ భద్రతకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ-భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కమిటీలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ సుబ్రహ్మణియన్ కొనసాగుతున్నారు. అలాగే మోదీ, షాలతో కూడిన నియమకాల కమిటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన జ్యోతిరాధిత్య సింధియా, అశ్వినీ వైష్ణవ్, నారాయణ్ రాణెకు పెట్టుబడులు-వృద్ధికి సంబంధించిన కేబినెట్ కమిటీలో చోటు దక్కింది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications