వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పు చేయకుంటే భయమెందుకు..సంజయ్‌‌ను ఎందుకు అరెస్ట్ చేశారు:సుదాంశ్ త్రివేది

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ లిక్కర్ స్కాం ఇష్యూ సెగలు రేపుతోంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్దం జరుగుతుంది. నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశంపైనే రగడ నెలకొంది. కవిత నివాసం వద్ద బీజేపీ నేతలను అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు. ఇవాళ బండి సంజయ్ ధర్నా నిర్వహించారు. అయితే అతనిని అరెస్ట్ చేయగా.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్‌ను వరంగల్ నుంచి కరీంనగర్ జిల్లాలో గల తిమ్మాపూర్ తరలించారు.

కవిత పాత్రపై విచారణ

కవిత పాత్రపై విచారణ

బండి సంజయ్ అరెస్ట్ బీజేపీ నేతలు తప్పుపట్టారు. బీజేపీ ఎంపీ సుదాంశ్ త్రివేది మండిపడ్డారు. లిక్కర్ స్కామ్‌తో కవిత హస్తం ఉందని చెప్పిందే ఎంపీ. కవిత పాత్ర లేకుంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తప్పు చేయకుంటే ఎందుకు ఆందోళన చెందుతున్నారని అడిగారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని అడిగారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం హక్కు అని దానిని కాలరాసే అధికారం పాలకులకు లేదని చెప్పారు.

విచారణలో వెలుగులోకి విషయాలు

విచారణలో వెలుగులోకి విషయాలు


బండి సంజయ్ అరెస్ట్ వెనక రాజకీయ దురుద్దేశం ఉందని సుదాంశ్ అన్నారు. అంతేకాదు లిక్కర్ స్కామ్‌‌లో కవిత పాత్రపై పోలీసుల విచారణ జరుగుతుందన్నారు. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. తప్పుచేసిన వారిని వదలబోమని తెలిపారు. చట్టం ముందు అందరూ సామానులేనని.. తప్పించుకునే ఆస్కారం లేదన్నారు.

 ప్రతిపక్షాలు లేరా..?

ప్రతిపక్షాలు లేరా..?


ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా.. అవినీతి చేయడం వాళ్లకు కొత్తేమీ కాదన్నారు. సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తున్నారనే కవిత , ప్రతిపక్షాల కామెంట్లు కొత్తేం కాదన్నారు. ఢిల్లీ కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం, బొగ్గు కుంభకోణంలో ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు లేరా? అని ఎంపీలు సుధాంశు, పర్వేశ్ కామెంట్స్ అడిగారు. మాగుంట అగ్రోఫామ్స్ కంపెనీకి కూడా ఢిల్లీ లిక్కర్ బిడ్డింగ్‌లో టెండర్ దక్కిందనే విషయాన్ని ఎంపీ సుధాంశు గుర్తుచేశారు. హోల్ సేల్ (ఎల్ 1) మద్యం వ్యాపారులకు ఇచ్చే కమిషన్ ను 2 శాతం నుంచి 12 శాతానికి ఎందుకు పెంచారో చెప్పాలని కేజ్రీవాల్ సర్కారును ప్రశ్నించారు.

English summary
police probe on kavitha hand in delhi liquor scam bjp mp sudhanshu trivedi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X