దారుణం: ప్రార్థన కోసం వచ్చిన అమ్మాయిని.. చర్చ్ ఫాదర్ ఏం చేశాడంటే...
గీత్ కుమార్ సోమనాథ్ పిళ్లై అలియాస్ మణికుట్టన్ (40) ఉల్లాస్ నగర్ లోని ఓ చర్చ్ లో ఫాదర్ గా పనిచేస్తున్నాడు. పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి చర్చ్ లో ప్రార్థన చేసేందుకు రెండేళ్లుగా వస్తోంది.
ఉల్లాస్‌నగర్ : ప్రార్థన చేసేందుకు చర్చ్ కు వచ్చిన ఓ అమ్మాయిపై మరో భక్తురాలి సహాయంతో ఓ చర్చ్ ఫాదర్ అత్యాచారం జరిపిన దారుణ ఘటన ముంబై నగరంలోని ఉల్లాస్ నగర్ లో వెలుగుచూసింది.
గీత్ కుమార్ సోమనాథ్ పిళ్లై అలియాస్ మణికుట్టన్ (40) ఉల్లాస్ నగర్ లోని ఓ చర్చ్ లో ఫాదర్ గా పనిచేస్తున్నాడు. పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి చర్చ్ లో ప్రార్థన చేసేందుకు రెండేళ్లుగా వస్తోంది.

చర్చ్ లో ఉన్న ఓ మహిళా భక్తురాలు ఒకరోజు ఆ అమ్మాయిని తీసుకువెళ్లి చర్చ్ ఫాదర్ కు పరిచయం చేసింది. అమ్మాయిని గదికి తీసుకువెళ్లిన ఫాదర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ గత రెండేళ్లుగా ఫాదర్ అత్యాచారం చేస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
అదే చర్చ్ కు వస్తోన్న మరో మహిళకు ఆ అమ్మాయి పట్ల చర్ఛ్ ఫాదర్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. విషయాన్ని ఆమె బాధితురాలి తల్లి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆ అమ్మాయిని తల్లి నిలదీసింది.
చర్ఛ్ ఫాదర్ తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, గత రెండేళ్లుగా ఇది జరుగుతోందని ఆ అమ్మాయి తల్లి ఎదుట చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆ అమ్మాయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చర్చ్ ఫాదర్ మణికుట్టన్ తోపాటు ఈ అత్యాచార ఉదంతంలో అతడికి సహకరించిన సదరు మహిళా భక్తురాలిని పోలీసులు అరెస్టు చేశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications