అలహాబాద్‌లో లా విద్యార్థిని కొట్టి చంపారు: వీధుల్లోకి విద్యార్థులు, బస్సు దగ్ధం

Posted By:
Subscribe to Oneindia Telugu

అలహాబాద్: యూపీలోని అలహాబాద్‌లో దారుణం జరిగింది. లా కోర్స్ చేస్తున్న విద్యార్థిని కొంతమంది దుండగులు కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శుక్రవారం రాత్రి లా స్టూడెంట్ దిలీప్(26) తన ఇద్దరు స్నేహితులతో కలిసి కర్నాల్‌గంజ్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు.

ఈ సమయంలోనే దిలీప్‌కు మరో ముగ్గురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో దిలీప్‌ను ఆ ముగ్గురు కలిసి రాళ్లు, కర్రలతో చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన దిలీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

Protests in Allahabad over law student's murder, Bus set on fire

ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెస్టారెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడు విజయ్ శంకర్ సింగ్(రైల్వే ఉద్యోగి)ను పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు, దిలీప్‌ను దుండగులు కొట్టిన సమయంలో పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వనందుకు రెస్టారెంట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని దిలీప్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా దిలీప్ హత్య నేపథ్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున అలహాబాదులో నిరసనలు చేపట్టారు. వీధుల్లో నినాదాలు చేశారు. అలహాబాద్ వర్సిటీ నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు వచ్చి పోలీసు అధికారుల కార్యాలయం ఎదుట నిరసనలకు దిగారు. ఓ బస్సును తగులబెట్టారు. రాళ్లు విసిరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Students shouted slogans on the streets of Uttar Pradesh's Allahabad, hurled stones and set fire to a bus in protests today over the killing of a 26-year-old law student at a restaurant by a group of men on Friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి