నడిరోడ్డులో అమ్మాయిని పట్టుకుని.. అందరూ చూస్తుండగా.. (వీడియో)

పూణే: ఓ అమ్మాయిని పట్టుకుని ముగ్గురు యువకులు రాత్రిపూట చితక్కొట్టారు. నడిరోడ్డులో అందరూ చూస్తుండగా ఆ అమ్మాయిని బూతులు తిడుతూ.. ఇష్టమొచ్చినట్లు కొట్టుకుంటూ వెళ్లారు.

పూణే నగరంలోని చంద్ నగర్ ప్రాంతంలో ఉన్న ఉప్పాలా హోటల్ వద్ద ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నడిరోడ్డుపై ఆ అమ్మాయిని వారు హింసిస్తున్నా ఎవరూ అదేంటని అడగలేదు, పట్టించుకోలేదు.

బాగా మందుకొట్టి ఉన్న ముగ్గురు అబ్బాయిలు.. ఆ అమ్మాయిని బండబూతులు తిడుతూ కొట్టుకుంటూ ముందుకెళ్లారు. అయితే ఈ వీడియోను సుమోటోగా తీసుకుని దాని ఆధారంగా ఆ యువకులను వెతికే పనిలో పడ్డారు పోలీసులు.

ఈ ఘటన అహ్మద్ నగర్ రోడ్డులో చోటుచేసుకున్నట్లు గుర్తించారు. స్థానికుల్లో కొంతమందిని విచారించడం ద్వారా అది ఫేక్ వీడియో కాదని, నిజంగానే ఆ యువకులు ఆ అమ్మాయిని వేధించారని పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు.

చందన్ నగర్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర మౌలిక్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలిని గురువారం ఉదయం గుర్తించినట్లు చెప్పారు. ఆమెను అడిగి కొన్ని వివరాలు తెలుసుకున్నామన్నారు. అనంతరం, ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని, ఈ అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు కూడా చేశామని చెప్పారు.

అసలేం జరిగిందంటే.. ఆ యువతి చదువు మానేసి ఒక దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. ఆదివారం సెలవుదినం కావడంతో రాత్రి 8 గంటల సమయంలో కరాడి వద్ద తన స్నేహితురాలిని కలిసేందుకు బయలుదేరింది.

మార్గం మధ్యలో ఓ రోడ్డు పక్కనే ఓ బెంచీపై కూర్చున్న ముగ్గురు యువకులు ఆమెను గమనించి అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆ ముగ్గురిలో కరణ్ హటగాలె(19), బంకర్ జాదవ్(19) అనే యువకులు ఆమెకు తెలుసు.

నడిరోడ్డుపై తనను బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో ఆ అమ్మాయి ప్రతిఘటించింది. అయినా వారు ఏమాత్రం లెక్కచేయకుండా ఆమెను కొట్టడం మొదలుపెట్టారు.

దీంతో ఆమె ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని తన సోదరుడికి ఫోన్ చేయగా అతడు స్కూటర్‌పై వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోయాడు. తన తండ్రి అనారోగ్యం కారణంగా ఇంట్లోనే నిద్రపోతున్నాడని, తల్లి కొల్హాపూర్‌కు వెళ్లిందని పోలీసులకు తెలిపింది.
జరిగిన ఘటన వారికి తెలిస్తే మరింత బాధపడతారనే ఉద్దేశంతో తాను చెప్పకుండా దాచి ఉంచినట్లు ఆమె పేర్కొంది. దీంతో ఆ ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు కరణ్, జాదవ్ లను అదుపులోనికి తీసుకుని మరో యువకుడి కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+