వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Punjab Record: 60 ఏళ్ల రికార్డు బద్దలు, సైలెంట్ గా వెళ్లి ఊడ్చేసింది, అది కాంగ్రెస్ టైమ్ లోనే !

|
Google Oneindia TeluguNews

పంజాబ్/న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. సైలెంట్ గా చీపురు పట్టుకుని ఢిల్లీ నుంచి పంజాబ్ కు వెళ్లిన అమ్ ఆద్మీ పార్టీ అక్కడ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు ఊడ్చేసింది. ఆప్ దెబ్బతో రెండు రోజుల క్రితం వరకు అధికారం మాదే అంటూ చంకలు గుద్దుకున్న కాంగ్రెస్ పార్టీకి త్రీడీ సినిమా కనపడింది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అనే సామెతలాగా కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలకు ఆ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతు అయ్యింది. పంజాబ్ ఎన్నికల్లో 60 ఏళ్ల చరిత్రను తిరగరాసిన ఆప్ పంజాబ్ లో తిరుగేలని పార్టీగా అవతరించింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ 60 ఏళ్ల తరువాత కొత్త రికార్డును అమ్ ఆద్మీ పార్టీ తిరగరాసింది. అది కూడా పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైమ్ లోనే ఆప్ ఈ చరిత్రను తిరగరాసింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న రికార్డును తెరమరుగు చేసిన ఆప్ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి ఇప్పుడు అధికారం దక్కించుకుంది. పంజాబ్ ప్రజల గుండెల్లో ఆప్ పాగా వెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు.

Recommended Video

Punjab Result 2022 : CM Arvind Kejriwal Offers Prayers In Delhi After Victory | Oneindia Telugu

Comedy kings: నిన్న కామెడీ కింగ్స్, నేడు రియల్ హీరోలు, ఉక్రెయిన్ జెలెన్ స్కీ, పంజాబ్ మాన్ లెక్క!Comedy kings: నిన్న కామెడీ కింగ్స్, నేడు రియల్ హీరోలు, ఉక్రెయిన్ జెలెన్ స్కీ, పంజాబ్ మాన్ లెక్క!

సైలెంట్ గా చీపురుతో ఉడ్చేసింది

సైలెంట్ గా చీపురుతో ఉడ్చేసింది


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇంతకాలం ఢిల్లీకే పరిమితం అయిన అమ్ ఆద్మీ పార్టీ అధికారం ఇప్పుడు పంజాబ్ లో కూడా మొదలైయ్యింది. సైలెంట్ గా చీపురు పట్టుకుని ఢిల్లీ నుంచి పంజాబ్ కు వెళ్లిన అమ్ ఆద్మీ పార్టీ అక్కడ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు ఊడ్చేసింది.

విభజన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఏదైనా ఉందా అంటే ?

విభజన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఏదైనా ఉందా అంటే ?


ఆప్ దెబ్బతో రెండు రోజుల క్రితం వరకు అధికారం మాదే అంటూ చంకలు గుద్దుకున్న కాంగ్రెస్ పార్టీకి త్రీడీ సినిమా కనపడింది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అనే సామెతలాగా కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలకు ఆ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతు అయ్యింది. భారతదేశంలో విభజన రాజకీయాలకు ఏదైనా అడ్రస్ ఉందా అంటే అది కాంగ్రెస్ పార్టీ అని మరోసారి రుజువు అయ్యిందని ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పంజాబ్ లో 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ రికార్డు

పంజాబ్ లో 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ రికార్డు


పంజాబ్ ఎన్నికల్లో 60 ఏళ్ల చరిత్రను తిరగరాసిన ఆప్ పంజాబ్ లో తిరుగేలని పార్టీగా అవతరించింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ 60 ఏళ్ల తరువాత కొత్త రికార్డును అమ్మ ఆద్మీ పార్టీ తిరగరాసింది. 1962లో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 90 స్థానాల్లో విజయం సాధించింది.

 కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైమ్ లో షాక్

కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైమ్ లో షాక్

1962 తరువాత ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండా అమ్ ఆద్మీ పార్టీ అదే పంజాబ్ లో ఏకంగా 92 అసెంబ్లీ నియోజక వర్గాల్లో విజయం సాధించి కాంగ్రెస్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ రికార్డును బ్రేక్ చేసే సమయంలో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది.

 బీజేపీ, అకాలీదళ్ రికార్డు ఉంది.... కాని అదికూడా బ్రేక్

బీజేపీ, అకాలీదళ్ రికార్డు ఉంది.... కాని అదికూడా బ్రేక్

1997లో పంజాబ్ లో బీజేపీ, అకాలీదళ్ కూటమి పోటీ చేసి 93 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. అయితే రెండు పార్టీలు కలిసి 93 సీట్లు కైవసం చేసుకోవడంతో అంతకు ముందు కాంగ్రెస్ పార్టీతో ఉన్న రికార్డు అలాగే ఉండిపోయింది. అయితే చీపురు దెబ్బకు హస్తం రికార్డు మట్టికిరించింది.

ఇంతకాదు కదా.... ఇంకా అంత జరిగినా ఇంతే

ఇంతకాదు కదా.... ఇంకా అంత జరిగినా ఇంతే

గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న రికార్డును తెరమరుగు చేసిన ఆప్ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి ఇప్పుడు అధికారం దక్కించుకుంది. పంజాబ్ ప్రజల గుండెల్లో ఆప్ పాగా వెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు. ఇంతకాదు కదా ఇంకా అంత జరిగినా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు ఏమాత్రం మారదని, ఇక మేమే మారిపోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారని తెలిసింది.

English summary
Punjab Record: The Aam Aadmi Party on Thursday swept Punjab, winning 92 of the 117 Assembly seats, in a record second to only that of an Akali Dal-BJP joint tally in 1997. The AAP's score matched the Akali Dal's figure of 92 from that election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X