వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుతపులి కలకలం: వారం రోజులుగా స్కూల్‌లోనే, బోనులో చిక్కకుండా చక్కర్లు

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం కోటాలోని ఓ పాఠశాలలో చిరుతపులి మకాం వేయడం స్థానికంగా భయాందోళనలకు కారణమవుతోంది. వారం రోజుల నుంచి పాఠశాలను వీడకపోవడంతో పాఠశాల విద్యార్థులకు కమ్యూనిటీ హాల్స్‌లో విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో రణథంబోర్ నేషనల్ పార్క్(ఆర్ఎన్పీ) నుంచి ఓ బృందం ఆ పాఠశాలకు వద్దకు చేరుకుంది. మంగళవారం నుంచి పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుపుతోంది. రాత్రి వరకు కూడా పులిని బయటకు తీసుకొచ్చేందుకు యత్నించారు. అయితే, పులి బయటకు రాకపోవడంతో భవనం వద్దే ఆ బృందం వేచిచూస్తోంది.

 Rajasthan: Leopard Makes School Its Home in s Kota, Students Forced To Study In Community Centres

మరోవైపు, అటవీశాఖ అధికారులు కూడా పాఠశాల ప్రాంగణంలో కెమెరాలను అమర్చి పులి కదలికలను తెలుసుకుంటున్నారు. బయటకు వస్తే బంధించేందుకు బోనులను కూడా ఏర్పాటు చేశారు. మత్తు ఇంజెక్షన్ చేసి పట్టుకోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆ తెలివైన చిరుతపులి చిక్కకుండా తిరుగుతోందని అధికారులు చెబుతున్నారు. స్థానికులు కూడా తమ సిబ్బందికి ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పులిని సురక్షితంగా బయటకి తీసుకొచ్చేందుకే తాము యత్నిస్తున్నట్లు వెల్లడించారు.

చుట్టుపక్కల ఇళ్లవారు తమ ఇళ్లల్లోకి చిరుత రాకూడదని బిగ్గరగా సంగీతం పెడుతున్నారు. దీంతో ఆ చిరుత కొంత గందరగోళానికి గురవుతోంది. పరిసర ప్రాంతాలు నిశ్శబ్ధంగా ఉంటే.. చిరుత బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో తాము సురక్షితంగా చిరుతను పట్టుకోగలమని అధికారులు చెబుతున్నారు.

English summary
Rajasthan: Leopard Makes School Its Home in 's Kota, Students Forced To Study In Community Centres.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X