రాజీనామా చేసేద్దాం: అధికారంపై రజనీకాంత్ షాకింగ్, 'మోడీ కూడా సూపర్ స్టారే'
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం నేపథ్యంలో ఆయన 2019 లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఆయన పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారు? కేడర్‌ను ఎప్పుడు సంసిద్ధం చేస్తారు? 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తారా లేక లోకసభ ఎన్నికల్లో నిలుస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం నేపథ్యంలో బీజేపీ ఓ అడుగు ముందుకేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రజనీకాంత్ కొత్త పార్టీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటుందని తమిళనాడు బీజేపీ చీఫ్ టీ సౌందరరాజన్ సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

రజనీకాంత్, మేం ఒకేదాని కోసం
సమయం వచ్చినప్పుడు లోకసభ ఎన్నికల్లో తాను కూడా భాగస్వామ్యం కానున్నానంటూ ఇప్పటికే రజనీకాంత్ ప్రకటించారు. అయితే ఆయన పోటీ గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో సౌందరరాజన్ మాట్లాడుతూ.. అవినీతిని అంతమొందించడం, సుపరిపాలనే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తుందని, రజనీకాంత్ కూడా అందుకే రాజకీయాల్లోకి వచ్చారని, దానిని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.

బీజేపీ ఉత్సాహం, అమిత్ షా ఏమన్నారంటే
ప్రధాని నరేంద్ర మోడీ రజనీకాంత్‌ను కలిసిన విషయం తెలిసిందే. గత నెలలో తమిళనాడు వచ్చినప్పుడు కూడా కలిశారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో చేతులు కలిపేందుకు తాము సిద్ధమని కమలనాథులు చెబుతున్నారు. అంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మాట్లాడుతూ.. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మాకు సంతోషమే అన్నారు.

ఇద్దరూ సూపర్ స్టార్లే
తమిళనాడులో తమ పార్టీని బలోపేతం చేయడమే తమ ముందున్న లక్ష్యమని బీజేపీ నేత జీవీఎల్ నర్సింహా రావు గతంలో చెప్పారు. రజనీకాంత్ సినిమాల్లో సూపర్ స్టార్ అని, అతనికి తిరుగులేదని, అలాగే ప్రధాని మోడీ జాతీయ రాజకీయాల్లో సూపర్ స్టార్ అని ఆయన వ్యాఖ్యానించారు.

గద్దెనెక్కాక మూడేళ్లలో చెప్పినవి చేయకుంటే రాజీనామా
ఇదిలా ఉండగా, క్రమశిక్షణ చాలా ముఖ్యమని, యుద్ధానికి తయారయ్యేంత వరకు తనతో సహా మనం ఎవరం రాజకీయాల గురించి మాట్లాడకూడదని, ఎవర్నీ విమర్శించవద్దని, ప్రకటనలు విడుదల చేయడం, పోరాటాలు చేయడం వంటి రాజకీయాలు చేసేందుకు చాలామంది ఉన్నారని, ప్రజల ప్రేమ, మద్దతును సొంతం చేసుకుందామని, మనం ఏం చేస్తామో వారికి చెబుదామని, గద్దెనెక్కిన తర్వాత మూడేళ్లలో ఆ పనులన్నీ చేసి చూపిద్దామని, లేకుంటే రాజీనామా చేసేద్దామని, నిజాయతీ, శ్రమ, ఉన్నత స్థాయి.. ఇదే మన తారకమంత్రమని రజనీకాంత్ అభిమానులతో చెప్పారు. మంచి అనుకుందామని, మంచి చేద్దామని, అంతా మంచే జరుగుతుందని, ఇదే మన లక్ష్యమని, ప్రజాస్వామ్య పోరులో ఇక మన సేన కూడా తప్పకుండా ఉంటుందని చెప్పారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications