ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేత రామ్‌నాథ్: ఎవరీ కోవింద్?

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రకటించారు. సోమవారం బిజెపి పార్లమెంటరీ భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించారు. అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రామ్‌నాథ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా 12 ఏళ్లు అనుభవం ఉంది. దళిత నేత. బిజెపి వ్యూహాత్మకంగా దళిత నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన 23వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Ramnath Govind is the Presidential candidate: BJP

రాజకీయాల్లోకి రాకముందు ఆయన సుప్రీం కోర్టు లాయర్‌గా పని చేశారు. నాలుగేళ్ల పాటు బిజెపి దళిత మోర్చా అధ్యక్షుడిగా పని చేశారు. వయస్సు 71.

రామ్‌నాథ్ గోవింద్ 1945 అక్టోబర్ 1వ తేదీన యూపీలోని కాన్పూర్ దెహత్ జిల్లా డేరాపూర్‌లో జన్మించారు. ఆయన యూపీ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. ఆలిండియా పోలీస్ సమాజ్ అధ్యక్షుడిగా పని చేశారు.

1994-2000, 2000-2006 మధ్య రెండుసార్లు రాజ్యసభకు వెళ్లారు. 1998 నుంచి 2002 వరకు బిజెపి దళిత మోర్చా అధ్యక్షుడిగా పని చేశారు. బిజెపి అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు.

ఢిల్లీ హైకోర్టులో 1977 నుంచి 79 వ‌ర‌కు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ అడ్వ‌కేట్‌గా ఉన్నారు. 1980 నుంచి 93 వ‌ర‌కు ఆయ‌న సుప్రీం కోర్టులో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ స్టాండింగ్ కౌన్సిల్ స‌భ్యుడిగా ఉన్నారు. 1978లో ఆయ‌న సుప్రీం కోర్టులో అడ్వ‌కేట్‌ రికార్డ్‌గా ప‌ని చేశారు. ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంలో ఆయ‌న 16 ఏళ్లు ప‌ని చేశారు. ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో 1971లో రామ్‌నాథ్ న్యాయ‌వాదిగా పేరు న‌మోదు చేసుకున్నారు.

రామ్‌నాథ్ రాజ‌కీయ కెరీర్ 1994లో మొద‌లైంది. పార్ల‌మెంట్‌కు చెందిన అనేక క‌మిటీల్లోనూ ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు. పార్ల‌మెంట్‌కు చెందిన‌ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ‌, హోంశాఖ‌, పెట్రోల్ మ‌రియు ఇంధ‌నం, సామాజిక న్యాయం, లా అండ్ జ‌స్టిస్‌, రాజ్య‌స‌భ హౌజ్ క‌మిటీల్లో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు. రామ్‌నాథ్ భార్య పేరు స‌వితా కోవింద్‌. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The BJP has announced that Ram Nath Kovind will be their presidential candidate.
Please Wait while comments are loading...