వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద నోట్లు నిలిపేసిన ఆర్బీఐ: పాట్నాకు మరోసారి అవే కష్టాలు!

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌ రాజధాని పాట్నా వాసులకు మరోసారి పెద్ద నోట్ల రద్దు నాటి పరిస్థితి ఎదుర్కొవాల్సి వచ్చింది. పాట్నాలోని పలు ఏటీఎంలకు రూ.500, రూ.2000 నోట్ల సరఫరా నిలిచిపోయింది. ఆర్‌బీఐ నుంచి పెద్ద నోట్ల సరఫరా ఆగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తడం గమనార్హం.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ)కు చెందిన దాదాపు 300 ఏటీఎంలకు పెద్ద నోట్ల సప్లై ఆగిపోవడంతో అక్కడి ప్రజలలు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఘటనతో మరోసారి పెద్ద నోట్లు రద్దైనట్లుగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RBI stops supply of Rs 2,000 and Rs 500 notes in several ATMs in Patna

ఈ విషయమై ఆర్‌బీఐతో మాట్లాడే యోచనలో ఉన్నట్లు ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ సయ్యద్‌ ముజఫర్‌ వెల్లడించారు. త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
ఇది ఇలావుంటే, గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో పెద్ద నోట్లను అక్కడికి తరలించడంతోనే ఇక్కడ నిలిచిపోయినట్లు ఆర్జేడీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

గుజరాత్‌లో పెద్దనోట్లతో ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై బీజేపీ నేత మంగళ్‌ పాండే మాట్లాడుతూ.. ఆర్జేడీ గుజరాత్‌ ఫోబియాతో బాధపడుతోందని చురకలంటించారు. తాత్కాలిక సమస్యలకు అనవసరంగా ఆగ్రహం వ్యక్తం చేయకూడదని త్వరలో సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు.

English summary
Several ATMs in Patna have been facing shortage of cash as the Reserve Bank of India has stopped supply of Rs 2,000 and Rs 500 notes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X