వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: సెప్టెంబర్‌లో కొత్త రూ. 200 నోటు: ఆర్‌బిఐ

కరెన్సీ నోట్లపై అక్రమదందాను అడ్డుకొనేందుకు ఆర్‌బిఐ చర్యలను తీసుకొంటోంది. నకిలీ నోట్లు రాకుండా అడ్డుకొనేందుకుగాను కొత్త కొత్త ప్రయోగాలకు రిజర్వ్‌బ్యాంక్ శ్రీకారం చుడుతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: కరెన్సీ నోట్లపై అక్రమదందాను అడ్డుకొనేందుకు ఆర్‌బిఐ చర్యలను తీసుకొంటోంది. నకిలీ నోట్లు రాకుండా అడ్డుకొనేందుకుగాను కొత్త కొత్త ప్రయోగాలకు రిజర్వ్‌బ్యాంక్ శ్రీకారం చుడుతోంది. తాజాగా రూ. 200 కొత్త నోటును ప్రవేశపెట్టాలని ఆర్‌బిఐ నిర్ణయించింది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదట్లో ఈ నోట్లు అందుబాటులోకి వస్తాయని ఆర్‌బిఐ ప్రకటించింది.

రూ100, రూ.500 మధ్య ఎలాంటి డినామినేషన్ లేకపోవడంతో కొత్తగా తీసుకొస్తున్న రూ.200 నోట్లు విపరీతమైన డిమాండ్ ఉంటుందని భావించిన ఆర్బీఐ అందుకు తగ్గట్టుగానే కసరత్తు చేస్తోంది.. ఇందులో భాగంగా రూ.200 కొత్త డినామినేషన్ నోట్లను రూ.50 కోట్ల మేర ముద్రించి... ఒకేసారి అందుబాటులోకి తీసుకురానుంది.

Reserve Bank of India to introduce Rs 200 notes beginning September

డీమానిటైజేషన్ తర్వాత చిల్లర సమస్య తీవ్రంగా నెలకొంది. దీంతో రూ.500 నోటును తీసుకువచ్చింది ఆర్‌బిఐ, వెయ్యి రూపాయాల నోటును తీసుకురాబోమని ఇప్పటికే ప్రకటించింది.అయితే చిల్లర సమస్యను అధిగమించేందుకు గాను రూ.200 నోటును తీసుకురావాలని ఆర్‌బిఐ నిర్ణయం తీసుకొంది.

రూ.2000 వేల డినామినేషన్ నోట్లను గుప్పిటపట్టిన బ్లాక్ మార్కెట్ దళారులు... తెచ్చిన నోట్లను తెచ్చినట్టు మాయం చేసేశారు. దీని కారణంగానే సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురైనట్టు ఆర్బీఐ గుర్తించింది. అందుకే ఈసారి భారీ మొత్తంలో రూ.200 కొత్త నోట్లు అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల సామాన్యులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుందని బ్యాకింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నల్లధనం, పన్ను ఎగవేతలు వంటి సమస్యలకు గుణపాఠం చెప్పేందుకే రూ.200 నోట్లు తీసుకొస్తున్నట్టు కనిపిస్తోంది.

English summary
Reserve Bank of India appears to be giving highest emphasis on how to avoid the possibility of an illegal trade of currency notes as it prepares to introduce Rs 200 denominated bank notes for the first time in history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X