Solar Eclipse(Surya Grahanam) Today: ఆకాశంలో కనిపించనున్న రింగ్ ఆఫ్ ఫైర్ - భారత్‌లో ఆ రెండు ప్రాంతాల్లోనే
ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. గురువారం(జూన్ 10) సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా ఆకాశంలో 'రింగ్ ఆఫ్ ఫైర్' ఏర్పడనుంది. చంద్రుడు సూర్యుడికి పూర్తిగా అడ్డుగా రావడం వల్ల అది ఓ రింగ్‌లా ఏర్పడుతుందని చెబుతున్నారు.భారత్‌లో అరుణాచల్ ప్రదేశ్,లదాఖ్‌లలో మాత్రమే ఈ అద్భుత దృశ్యం కనిపించనుంది.
Recommended Video
అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రాంతంలో సాయంత్రం 5.52గంటల సమయంలో,నార్త్ లదాఖ్‌లో సాయంత్రం 6.15గంటల సమయంలో ఆకాశంలో 'రింగ్ ఆఫ్ ఫైర్' కనిపించే అవకాశం ఉంది. భారత్‌లోని మిగతా ప్రాంతాల్లో ఇది కనిపించదు. నార్త్ అమెరికా,గ్రీన్‌లాండ్,కెనడా,ఆర్కిటిక్,అంటార్కిటిక్,యూరోప్,రష్యా,ఆస్ట్రేలియా దేశాల్లో సంపూర్ణ సూర్య గ్రహణం కనిపించనుంది. మధ్యాహ్నం 1.42గంటల నుంచి సాయంత్రం 6.41గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే మే 26న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. ఇవాళ(జూన్ 10) సూర్య గ్రహణం ఏర్పడనుండగా... ఇదే ఏడాది నవంబర్ 19న పాక్షిక చంద్రగ్రహణం,డిసెంబర్ 4న సంపూర్ణ గ్రహణం ఏర్పడనున్నాయి.
పండితులు చెబుతున్న ప్రకారం... ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావ భారత్‌పై ఉండదు కాబట్టి ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. సూర్యగ్రహణం కనిపించే దేశాల్లో నివసించే భారతీయులు మాత్రం గ్రహణ సమయంలో వారి పరిస్థితులను బట్టి జప, తప, తర్పణ, స్నాన,హోమాది క్రతువులు నిర్వహించవచ్చు. తాజా సంపూర్ణ గ్రహణం రోహిణి నక్షత్రంలో ఏర్పడుతున్నందనా వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం సంభవించే దేశాల్లో గ్రహణ సమయంలో వృషభ రాశివారు సూర్యారాధన, రాహు, దుర్గాదేవి జపం ఆచరించాలని సూచిస్తున్నారు.
కాగా,ఇటీవల సంపూర్ణ చంద్రగ్రహణం రోజున ఆకాశంలో 'బ్లడ్ మూన్' ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. సూర్యుడికి చంద్రునికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు సూర్యకిరణాల్లోని ఎరుపు, నారింజ రంగు కిరణాలు భూమి నుంచి చందమామపై ప్రసరించడంవల్ల బ్లడ్ మూన్ ఆవిష్కృతమైంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications