వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్కేనగర్‌లో దినకరన్ ఘనవిజయం, జయలలిత రికార్డ్ బ్రేక్!: డిపాజిట్ కోల్పోయిన డీఎంకే, అన్నాడీఎంకేకు షాక్

|
Google Oneindia TeluguNews

ఆర్కే నగర్: తమిళనాడులోని ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో చిన్నమ్మ శశికళ వర్గం నేత, స్వతంత్ర అభ్యర్థి దినకరన్ ఘన విజయం సాధించారు. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలకు షాకిస్తూ ఆయన 40,707 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ గెలుపుతో శశికళ వర్గం సంబరాల్లో మునిగి తేలింది. 19 రౌండ్లు లెక్కించారు. దినకరన్ అమ్మ జయలలిత కంటే ఎక్కువ మెజార్టీ సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గతంలో జయలలిత సాధించిన మెజార్టీని దాటారు.

డీఎంకే, బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఈ రెండు పార్టీలు కూడా డిపాజిట్ కోల్పోయాయి. దినకరన్‌కు 89,013 ఓట్లు, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌కు 47,115 ఓట్లు, డీఎంకే అభ్యర్థి మరుధు గణేష్‌కు 24,005, నామ్ తమిళర్ పార్టీకి 3,802 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కారు నాగరాజన్‌కు 1,368 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం.

సంబరాల్లో శశికళ వర్గం, డిపాజిట్ కోల్పోయిన డీఎంకే

సంబరాల్లో శశికళ వర్గం, డిపాజిట్ కోల్పోయిన డీఎంకే

ఆర్కే నగర్‌లో దినకరన్ విజయం నేపథ్యంలో శశికళ వర్గం సంబరాల్లో మునిగి తేలింది. దినకరన్ గెలిచినట్లు ప్రకటించగానే ఆయన నివాసం వద్దకు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దినకరన్‌కు పార్టీ పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. జయ వారసులు శశికళ - దినకరన్ అంటూ వ్యాఖ్యానించారు. గెలుపు అనంతరం దినకరన్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు తనప నమ్మకం ఉంచారని చెప్పారు. అమ్మ ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు.

తొలి నుంచి లీడ్‌లో దినకరన్

తొలి నుంచి లీడ్‌లో దినకరన్

- 18వ రౌండ్ పూర్తయ్యేసరికి దినకరన్ 86వేలకు పైగా, అన్నాడీఎంకే అభ్యర్థి 47వేలకు పైగా, డీఎంకే అభ్యర్థి 24వేలకు పైగా ఓట్లు సాధించారు. గతంలో జయలలిత సాధించిన మెజార్టీకి దగ్గరగా దినకరన్ ఉన్నారు. ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యంతో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ నుంచి ఆయన ఆధిక్యత కనబర్చారు. ఈ రౌండ్ ముగిసేసరికి దినకరన్ 39వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించారు.

14వ రౌండ్ పూర్తయ్యేసరికి..

14వ రౌండ్ పూర్తయ్యేసరికి..

- 14వ రౌండ్ పూర్తయ్యేసరికి దినకరన్ 32వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 68 వేల ఓట్లకు పైగా రాగా, అన్నాడీఎంకేకు 36వేలకు పైగా వచ్చాయి. డీఎంకే అభ్యర్థికి 18వేలకు పైగా వచ్చాయి.

- పది రౌండ్లు ముగిసేసరికి దినకరన్‌కు వచ్చిన ఓట్లు 54వేలకు పైగా ఉన్నాయి. అన్నాడీఎంకేకు 25వేల ఓట్ల పై చిలుకు ఓట్లు వచ్చాయి. 12వ రౌండ్ పూర్తయ్యేసరికి దినకరన్ 26వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

నివాళులు జయలలిత సమాధి వద్ద నివాళులు

నివాళులు జయలలిత సమాధి వద్ద నివాళులు

- మధ్యాహ్నం జయలలిత సమాధి వద్ద దినకరన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దినకరన్ మాట్లాడారు. తనను గెలిపించాలని ఆర్కే నగర్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని చెప్పారు.

- ఓట్ల లెక్కింపు ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి టీటీవీ దినకరన్ విజయం దిశగా సాగుతున్నారు. 39,548 ఓట్లు దినకరన్‌కు, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌కు 19,525 ఓట్లు, డీఎంకే అభ్యర్థికి 10,292 ఓట్లు వచ్చాయి. అప్పటికి దినకరన్ ఓట్లు 20వేల ఓట్ల మార్క్‌కు చేరువయ్యాయి.

నేనే అమ్మ వారసుడను అంటూ

నేనే అమ్మ వారసుడను అంటూ

- శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ ఐదు రౌండ్లు ముగిసేసరికి 11వేల మెజార్టీతో ఉన్నారు. దినకరన్‌కు 24వేలకు పైగా, అన్నాడీఎంకే అభ్యర్థికి 11వేలకు పైగా ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి నోటా కంటే తక్కువ రావడం గమనార్హం.

- ఆర్కే నగర్ ఫలితంతో తానే అమ్మ వారసుడిని అని ప్రజలు తేల్చారని దినకరన్ చెప్పారు.
- అన్నాడీఎంకే పగ్గాలు శశికళ - దినకరన్ చేతికి ఇవ్వాలని వీరి వర్గీయులు డిమాండ్ చేశారు.

- ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన అన్నాడీఎంకే అభ్యర్థి మదుసూదన్‌పై 8835 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దినకరన్‌కు 15,868, అన్నాడీఎంకే అభ్యర్థికి 7,033, డీఎంకే అభ్యర్థికి 3,750 ఓట్లు వచ్చాయి.

3 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని

3 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని

- ఈ నేపథ్యంలో దినకరన్ మాట్లాడారు. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్కే నగర్ ఎన్నికలు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అన్నారు. ఆర్కే నగర్ ప్రజలు తమ ఓటుతో రాష్ట్ర ప్రజల అభిప్రాయం చెప్పారన్నారు. ఎన్నికల గుర్తు లెక్క కాదని, నిలబడిన వ్యక్తి ముఖ్యమని చెప్పారు.

- దినకరన్‌కు రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం పెరుగుతోంది. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నాడు. దినకరన్ గెలుపు దిశగా సాగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత

లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత

- ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న క్వీన్ మేరీ కాలేజీ ప్రాంగణంలో అన్నాడీఎంకే వర్గాలు అధికారులు, దినకరన్ వర్గాలతో వాగ్వాదానికి దిగాయి. సమాచారం మేరకు అన్నాడీఎంకే వర్గాలు దాడికి పాల్పడ్డారు. దీంతో కౌంటింగ్ నిలిపివేశారు. పారామిలిటరీ దళాలు పరిస్థితిని చక్కదిద్దడంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కౌంటింగ్ కొనసాగింది.

- ప్రతి రౌండులోను దినకరన్ దూసుకెళ్తున్నాడు. ఏదో జరిగి ఉంటుందని అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

- ప్రతి రౌండులో దినకరన్ దూసుకెళ్తున్నాడు. దినకరన్‌కు 10,421, అన్నాడీఎంకే అభ్యర్థికి 4,521, డీఎంకే అభ్యర్థికి 2,383 ఓట్లు వచ్చాయి.
- ఆ తర్వాత రౌండ్లలోను దినకరన్ దూసుకెళ్తున్నాడు. దినకరన్‌కు 5339, మధుసూధనన్‌కు 2738, మరుథు గణేష్‌కు 1182 ఓట్లు వచ్చాయి.
- రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి దినకరన్‌కు 1891 ఓట్లు, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూధనన్‌కు 646 ఓట్లు, డీఎంకే అభ్యర్థి మరుథు గణేష్‌కు 360 ఓట్లు వచ్చాయి.
- రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి 1244 ఓట్ల ఆధిక్యంలో దినకరన్.
- దినకరన్‌కు పన్నీరు-పళనిస్వామి వర్గాలు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
- తొలి రెండు రౌండ్లలో దినకరన్‌దే ఆధిక్యం.
- తొలి ఓటు డీఎంకు పడింది.
- కౌంటింగ్ కేంద్రంలోకి కేవలం అధికార పక్షం వారినే పంపిస్తున్నారని, విపక్ష నేతలు వాగ్వాదానికి దిగారు.
- కౌంటింగ్ ఎనిమిది గంటలకు ప్రారంభమైంది.

English summary
The counting of votes for the R K Nagar bypoll will be taken up on December 24 and the results are expected to be out by afternoon that day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X