పట్టపగలే.. నడిరోడ్డుపై.. టెక్కీ దారుణ హత్య! డాష్ కొట్టి.. రూ.500 అడిగితే ఇవ్వలేదని...

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ను గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా నరికి చంపేశారు.

వివరాల్లోకి వెళితే... ఒడిశాలోని భువనేశ్వర్ కు చెందిన ప్రణయ్ మిశ్రా(25.. బెంగళూరులో 2014 నుంచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి ప్రణయ్, అతడి స్నేహితుడు కలిసి పార్టీ చేసుకున్నాడు.

సోమవారం మధ్యాహ్నం టవారికేరిలోని నివాసం వద్ద ప్రణయ్‌ని స్నేహితుడు వదిలివెళ్లాడు. తర్వాత ప్రణయ్ కు అతడి ప్రియురాలి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆమెను కలిసేందుకు అతడు చాకొలెట్ కంపెనీ వద్దకు చేరుకున్నాడు.

అదే సమయంలో టెక్కీ ప్రణయ్‌పై ఇద్దరు అగంతకులు కత్తులతో దాడి చేశారు. నడిరోడ్డుపై పరుగులు పెడుతున్నా వారు వదల్లేదు. ఈ ఘటనలో ప్రణయ్ తీవ్రంగా గాయపడ్డాడు.

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ప్రణయ్‌ను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని వారు భావిస్తున్నారు.

అసలే రౌడీ షీటర్...

అసలే రౌడీ షీటర్...


టెక్కీ ప్రణయ్ మిశ్రా హత్య కేసులో నిందితుడిని పోలీసులు సినీ ఫక్కీలో పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... మంగళవారం సాయంత్రం నిందితుడు తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళుతూ పరప్పన అగ్రహార జైలు వద్ద పోలీసులకు తారసపడ్డాడు.

పోలీసులను చూడగానే పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారికి అనుమానం వచ్చి వెంటాడారు. ఒక దశలో అతడు పోలీసులపైకి రాళ్లు విసరడమే కాక పదునైన కత్తితో వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి.

దీంతో పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. తొలుత గాల్లోకి కాల్పులు జరిపి, ఆనక నిందితుడి కాళ్లపై కాల్చారు. అతడు కుప్పకూలిపోగా, అతడితో ఉన్న స్నేహితుడు మాత్రం పరారయ్యాడు.

పోలీసుల విచారణలో అతడి పేరు కార్తీక్ అని, అతడో పేరుమోసిన రౌడీషీటర్ అని, అంతకుముందు రోజు చాక్లెట్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన టెక్కీ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడని తేలింది. అంతేకాదు, కార్తీక్ పై గతంలో వేర్వేరు పోలీసుస్టేషన్లలో 8 కేసులు నమోదై ఉన్నాయని డీసీపీ లింగయ్య తెలిపారు.

రోడ్డుపై చిన్న గొడవ..

రోడ్డుపై చిన్న గొడవ..

టెక్కీ ప్రణయ్ మిశ్రా హత్యకు కారణం రోడ్డుపై జరిగిన చిన్న గొడవని పోలీసుల విచారణలో తేలింది. తన ప్రియురాలిని కలిసేందుకు ప్రణయ్ స్కూటర్ పై వెళుతుండగా, అనుకోకుండా అతడి స్కూటర్ రౌడీ షీటర్ కార్తీక్, అతడి స్నేహితుడైన అరుణ్ ప్రయాణిస్తున్న బైక్ కు తగిలింది.

దీంతో కార్తీక్ అతడి స్నేహితుడు టెక్కీ ప్రణయ్ తో గొడవపడ్డారు. అతడు గుద్దడం వల్లే తమ బైక్ మడ్ గర్డ్ దెబ్బతిందని, దాన్ని బాగుచేయించుకునేందుకు రూ.500 ఇవ్వమని డిమాండ్ చేశారు.

అయితే ప్రణయ్ అందుకు ఒప్పుకోలేదు. జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదని చెప్పి స్కూటర్ స్టార్ట్ చేసుకుని అక్కడ్నించి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో రౌడీషీటర్
కార్తీక్, అతడి స్నేహితుడు అరుణ్ బైక్ పై ప్రణయ్ ను వెంబడించి మళ్లీ అతడ్ని అడ్డగించారు.

ఒక్కసారిగా వారు బైక్ పై అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేసిన టెక్కీ ప్రణయ్ ఆ ఊపుకు స్కూటర్ పైనుంచి కిందపడిపోయాడు. అదే అదనుగా రౌడీషీటర్ కార్తీక్ ప్రణయ్ ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. అంతటితో ఆగకుండా కత్తితీసి ప్రణయ్ కడుపులో రెండు పోట్లు పొడిచి అతడ్ని అక్కడే వదిలేసి వారు పరారయ్యారు.

స్నేహితుడి బైక్ తీసుకుని...

స్నేహితుడి బైక్ తీసుకుని...

టెక్కీ ప్రణయ్ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు మూడు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితుల బైక్ ను పోలీసులు గుర్తించారు. బైక్ నంబర్ ఆధారంగా దాని యజమానిని ట్రేస్ చేయగలిగారు.

తనకేం తెలియదని, తన స్నేహితులైన కార్తీక్, అరుణ్ ఆదివారం రాత్రి పనుందంటూ తన బైక్ తీసుకుని వెళ్లారని చెప్పడంతో పోలీసులు అతడిచ్చిన సమాచారం మేరకు నిందితులిద్దరి కోసం హస్కర్ గేట్ వద్ద కాపుకాశారు.

పోలీసులను చూడగానే...

పోలీసులను చూడగానే...

పోలీసులను చూడగానే రౌడీషీటర్ కార్తీక్ అతడి స్నేహితుడు బైక్ పై పరారయ్యేందుకు ప్రయత్నిచారు. దీంతో పోలీసులు కూడా తమ వాహనంలో వారిని చిట్నమంగళ వైపు వెళ్లే రోడ్డులో వెంబడించారు.

పోలీసులు కార్తీక్, అరుణ్ లను లొంగిపొమ్మని హెచ్చరించినా వారు వినలేదు. మెయిన్ రోడ్డుపై వెళితే పోలీసులకు దొరికిపోతామని భావించిన కార్తీక్ హఠాత్తుగా బైక్ ను కుడివైపుకు తిప్పి ఓ మట్టిరోడ్డులోకి ప్రవేశించాడు. అలా వెళుతూ.. డెడ్ ఎండ్ వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక ఆగిపోయారు.

దీంతో వెనుక కూర్చున్న అరుణ్ దిగి అక్కడ్నించి పరారవగా, కార్తీక్ తెగబడి పోలీసులకు పైకి రాళ్లు విసిరాడు. హెచ్ఎస్ఆర్ లేఔట్ ఎస్సై రవి అతడ్ని అదుపులోకి తీసుకునేందుక ప్రయత్నించగా తన వద్ద ఉన్న కత్తితో అతడు ఎస్సైపై దాడి చేశాడు.

దీంతో కోరమంగళ ఇన్ స్పెక్టర్ మంజునాథ్, మడివాల ఇన్ స్పెక్టర్ మల్లేష్ చెరో రౌండ్ కాల్పులు జరిపారు. చివరికి రౌడీషీటర్ కార్తీక్ కాళ్లపై కాల్పులు జరిపి చివరికి అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో ఇన్ స్పెక్టర్ మంజునాథ్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన ముగ్గురు పోలీసు అధికారులు సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరోవైపు తప్పించుకుని పారిపోయిన అరుణ్ కోసం పోలీసులు గాలింపును తీవ్రం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The murder of a 28-year-old techie near Chocolate Factory on Taverekere Main Road early on Monday morning, which was initially suspected to be over personal enmity turned out to be a case of road rage. What is even more shocking is that it was over just Rs 500 that the accused demanded from the victim after a small accident. The deceased, Pranay Mishra, a software engineer with Accenture – hailed from Odisha, was riding his way to his girlfriend’s house around 2.30 am on Monday when his scooter brushed against bike, which was being ridden by rowdies Karthik and Arun.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి