స్మిజా సెల్యూట్: రూ.6 కోట్ల లాటరీని ఇచ్చేసింది.. నితీగా, నిజాయితీ, నిక్కచ్చిగా...
నాదీ కానిది అర్ద రుపాయి కూడా అక్కర్లేదు.. తనకు చెందినదీ అయితే ఎంతదూరం అయినా వెళ్లేందుకు వెనకాడను.. ఇదీ సాహసం సినిమాలో హీరో డైలాగ్. ఈ డైలాగ్ మీదే సినిమా ఇతివృత్తం ఉంటుంది. అయితే అది రిల్.. రీయల్ లైఫ్ వేరు. నగదు, నగలు, ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు తీసుకునేందుకు ఎవరైనా వెనకాడతారా అస్సలు ఉండరు. అవును నిజమే మరీ. కానీ కేరళలో ఒకామె రూ.6 కోట్ల లాటరీ విషయంలో నిక్కచ్చిగా, నిజాయతీగా ఉన్నారు.

రూ.6 కోట్ల లాటరీ
లాటరీ టికెట్లను విక్రయిస్తూ ఓ మహిళ కుటుంబాన్ని నడుపుకుంటున్నారు. రూ. 6 కోట్లు గెలుచుకున్న లాటరీ టికెట్‌ను కస్టమర్‌కు అందించింది. ఆమె తలచుకుంటే ఆ టికెట్ తన వద్దే ఉంచుకొని ఆ నగదును సొంతం చేసుకోవచ్చు. ఆమెలో నిజాయితీ ఆ తప్పు చేయనివ్వలేదు. కోచికి చెందిన స్మిజా మోహన్ వద్ద ఇటీవల 12 లాటరీ టికెట్లు మిగిలిపోయాయి. ఆ రోజు ఆదివారం కావడంతో ఎవరూ టికెట్లు కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో ఆమె లాటరీ టికెట్ కస్టమర్లతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులలో ఆ టికెట్లను పోస్టు చేసింది.

టికెట్ కొనుగోలు నో ఇంట్రెస్ట్
అప్పటికీ ఎవరూ ఆ టికెట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో ఆమెకు తెలిసిన మరో కస్టమర్ చంద్రన్ చేతన్‌కు ఫోన్ చేసింది. దీంతో అతడు కొన్ని నెంబర్లు చెప్పాడు. ఆ నెంబరు ఉన్న టికెట్‌ను మాత్రమే కొంటానని తెలిపాడు. సరిగ్గా అతడు చెప్పిన నెంబర్లకే బంపర్ లాటరీ తగిలింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్మిజా ఆ టికెట్‌ను తన వద్ద ఉంచుకోకుండా చంద్రన్‌కు ఇచ్చేసింది. ఆమె తలచుకుంటే ఆ టికెట్ తన వద్ద లేదని చెప్పి.. లాటరీ మొత్తాన్ని ఆమె తీసుకోవచ్చు. కస్టమర్‌ను మోసం చేయడం ఇష్టం లేక... రూ. 6 కోట్లు తగిలిన ఆ లాటరీ టికెట్‌ను అతడి చేతిలో పెట్టింది. దీంతో అతడు ఆ మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు.

పార్ట్ టైం జాబ్.. కానీ నిజాయతీ
స్మిజ తన భర్తతో కలిసి అలువాలోని రాజాగిరి హాస్పిటల్ సమీపంలో లాటరీ స్టాల్ నడుపుతోంది. కక్కానడ్‌లోని గవర్నమెంట్ ప్రెస్‌లో పనిచేసేవాళ్లమని వివరించారు. పార్ట్‌టైమ్ కింద లాటరీ టికెట్లు అమ్మేవాళ్లమని చెప్పారు. 2011లో ఐదుగురు సిబ్బందితో పని ప్రారంభించామని వివరించారు. ప్రెస్‌లో ఉద్యోగాలు పోవడం వల్ల లాటరీ టికెట్ల విక్రయాన్నే ఉపాధిగా మలుచుకున్నానని పేర్కొన్నారు. పేదరికాన్ని అనుభవిస్తున్న సారే, మోసానికి పాల్పడకుండా నిజాయతీ ప్రదర్శించారు.