బిగ్ స్టెప్: ఎస్‌బీఐ సంచలన యాప్... ‘యొనో’.. ఇక డిజిటల్ బ్యాంకింగ్ సేవలు షురూ...
సంప్రదాయ బ్యాంకింగ్ సర్వీసులకు భిన్నంగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సరికొత్త బ్యాంకింగ్ వేదికను సిద్ధం చేసింది. ‘యొనో’ (యూ వోన్లీ నీడ్ వన్) పేరుతో కొత్త యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ముంబై: సంప్రదాయ బ్యాంకింగ్ సర్వీసులకు భిన్నంగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సరికొత్త బ్యాంకింగ్ వేదికను సిద్ధం చేసింది. 'యొనో' (యూ వోన్లీ నీడ్ వన్) పేరుతో కొత్త యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
డిజిటల్ బ్యాంకింగ్‌లో కీలక ముందడుగుగా భావిస్తున్న ఈ యాప్‌ను ఇప్పటికే ఎస్బీఐ విడుదల చేయగా... నేడు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అధికారికంగా ప్రారంభించనున్నారు.

యొనో.. యూ వోన్లీ నీడ్ వన్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త యాప్ ‘యొనో'ను విడుదల చేసింది. తొలి డిజిటల్ బ్యాంకింగ్ వేదికగా చెబుతున్న ఈ యాప్ ద్వారా... వినియోగదారులు క్యాబ్ బుకింగ్స్, రెంటింగ్, వినోదం, డైనింగ్, ట్రావెల్, హోటల్స్ సహా దాదాపు 14 కేటగిరీల్లో చెల్లింపుల కోసం సులభంగా ఉపయోగించుకోవచ్చు.

డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
ఈ యాప్ ద్వారా డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందించేందుకు ఎస్బీఐ దాదాపు 60 ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. అమెజాన్, ఉబెర్, ఓలా, మింత్రా, జబాంగ్, షాపర్స్ స్టాప్, ఎయిర్ బీఎన్బీ వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి. యాప్, వెబ్ రెండువిధాలుగానూ యొనో అందుబాటులోకి వస్తోంది.

ఇక డిజిటల్ సేవలు...
ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేసే యొనో... మొబైల్ ఫోన్ ద్వారానే డిజిటల్ ఖాతాలు తెరవడం (క్యాష్ డిపాజిట్, విత్‌డ్రా సేవలు మినహా), ఆన్‌లైన్ షాపింగ్, బుకింగ్‌లు, ఆర్డర్లు, అన్ని రకాల వాణిజ్య ఉత్పత్తుల కొనుగోలు సహా పలు సేవలు అందించనుంది.

పత్రాలు నింపే పనిలేకుండా...
ఎస్బీఐ తీసుకొచ్చిన కొత్త యాప్ ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఎలాంటి పత్రాలు నింపే పనిలేకుండా ముందస్తు వ్యక్తిగత రుణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఓవర్ డ్రాప్టులు కూడా పొందవచ్చు.

ఇంటి వద్ద నుంచే సేవలు...
ఇది వాస్తవానికి డిజిటల్ బ్యాంకే అయినప్పటికీ... ఎస్బీఐలో భాగంగానే ఉంటుందని ఎస్బీఐ ఎండీ పీకే గుప్త పేర్కొన్నారు. ఆధార్ నెంబరు, వన్‌టైమ్ పాస్‌వర్డ్ ధ్రువీకరణతో ఇంటి వద్ద నుంచే సేవలు అందుకోవచ్చునని వెల్లడించారు.

వన్ టైం బయోమెట్రిక్ ధ్రువీకరణతో...
ఆర్బీఐ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ అథెంటికేషన్ లేకుండా పరిమితికి మించి లావాదేవీలు జరిపే అవకాశం లేనందున.. బ్యాంకు ఏదో ఒక బ్రాంచిలో బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తయితే... ఇక డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications