వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో క్యాన్సర్‌కు వ్యాక్సిన్: పరిశోధనల్లో నిమగ్నమైన శాస్త్రవేత్తలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: క్యాన్సర్ వ్యాధి కట్టడికి టీకా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. శాస్త్రవేత్తలు ఇందుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. కీలకమైన కణితులను గుర్తించే, తుదముట్టించే తీరును రోగనిరోధకశక్తికి నేర్పిస్తున్నారు. నిజానికిది ఫ్లూ, పోలియో వంటి టీకాల మాదిరిగా జబ్బును నివారించదు కానీ, క్యాన్సర్ తిరగబెట్టకుండా రక్షణ కల్పిస్తుంది.

కణితి కణాల్లోని ప్రోటీన్లను ప్రమాదకరమైనవని గుర్తించేలా రోగనిరోధక శక్తిని తయారు చేస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇమ్యూనోథెరపీ ప్రభావాన్ని మరింత పెంచుతుందనీ ఆశిస్తున్నారు. రోగనిరోధక చికిత్సను ఎంఆర్ఎన్ఏ టీకాతో కలిపి ఇవ్వగా.. చర్మ క్యాన్సర్ తిరగబెట్టే ముప్పు, దీంతో మరణించే అవకాశం 44 శాతం వరకు తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. అందుకే ఈ అంశం చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Scientists working on developing vaccine for cancer

ఎంఆర్ఎన్ఏ ఆధారిత క్యాన్సర్ టీకా సామర్థ్యం ఓ చిన్నపాటి అధ్యయనంలో
బయట పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పెద్ద పరిశోధనల్లోనూ మంచి ఫలితం కనిపిస్తే చికిత్సలో విప్లవాత్మక మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అయితే, క్యాన్సర్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సుదీర్ఘ ప్రక్రియ జరగాల్సి ఉందని చెబుతున్నారు. ఆయా వ్యక్తుల కణితుల్లోని జన్యువులకు అనుగుణంగా దీన్ని రూపొందించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ టీకాను విస్తృతంగా, చవకగా అందుబాటులోకి తెచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. టీకా తయారీలో పరిశోధనలు వేగంగా జరగాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

English summary
Scientists working on developing vaccine for cancer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X