ఫస్ట్ నైట్ మిస్ చేసిన కొత్త జంట సెల్ఫీ మోజు: ఏం జరిగిందంటే..?

Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో ఓ కొత్త పెను ప్రమాదం నుంచి బయటపడింది. సెల్ఫీ మోజులో పడి ప్రాణాలపైకి తెచ్చుకున్న ఆ జంటను పోలీసులు కాపాడారు. ఈ ఘటన నామక్కల్ జిల్లా కుమారపాళయంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కుమారపాళయానికి చెందిన ఇళంగోవన్‌కు శుక్రవారం నాడు వైష్ణవి అనే యువతితో వివాహం అయింది. వీరి కుటుంబ సంప్రదాయం ప్రకారం.. ఊరాచ్చికోట సమీపంలో ఉన్న వేదగిరి కొండకు కాలినడకన వెళ్లి శివాలయంలో పూజలు చేసి దిగొచ్చిన తర్వాతనే శోభన ముహుర్తం పెట్టుకుంటారు.

A new couple missed their first night due to selfie effect in Tamil Nadu.

ఈ నేపథ్యంలో కొండకు వెళ్లిన కొత్త జంట.. కిందకి దిగివస్తూ 50 అడుగుల లోయ వద్ద సెల్ఫీ దిగాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో కాలుజారి ఇద్దరూ లోయలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడారు. దీంతో కొంత జంటతోపాటు వారి కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A new couple missed their first night due to selfie effect in Tamil Nadu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X