ఆధార్‌పై సుప్రీం తీర్పు కేంద్రానికి శరాఘాతం: ప్రశాంత్‌భూషణ్
న్యూఢిల్లీ: ఆధార్‌పై 9 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు కేంద్రప్రభుత్వానికి శరాఘాతమేనని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు.
ఆధార్‌ను తప్పనిసరి చేయడం సరికాదని కేంద్రానికి గతంలో సుప్రీంకోర్టు సూచించింది. అయినా కేంద్రం దాన్ని పట్టించుకోలేదు. తాజాగా ఆధార్‌ను తప్పనిసరి చేయడం ప్రాథమికహక్కులను కాలరాయడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను న్యాయస్థానాలు పరిరక్షిస్తున్నాయని చెప్పేందుకు ఈ తీర్పును ఉదాహరణగా చెప్పవచ్చని ఆయన తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి అర్ధమవుతుందని తాను భావిస్తున్నానని ప్రశాంత్‌భూషణ్ చెప్పారు.












Click it and Unblock the Notifications