వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రబుల్ షూటర్‌కు లక్కీ ఛాన్స్.. కర్నాటక సీఎంగా శివ కుమార్?

|
Google Oneindia TeluguNews

Recommended Video

కర్నాటక సీఎంగా శివకుమార్ ఎంపికకు పడుతున్న అడుగులు | Shivakumar Hints At Appointing Congress CM

బెంగళూరు : కన్నడ రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. గంటకో మలుపు తిరుగుతూ ఆసక్తి కలిగిస్తున్నాయి. రెండు రోజుల అనంతరం కర్నాటక అసెంబ్లీ తిరిగి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం బలపరీక్ష తప్పనిసరిగా జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పుకు సైతం సంకీర్ణ సర్కారు సిద్ధమైంది.

కాంగ్రెస్ నేత ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలం చేకూర్చుతున్నాయి. జేడీఎస్ ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని, కాంగ్రెస్ నుంచి ఒకరు సీఎం పదవి చేపట్టే అవకాశముందని చెప్పారు. కూటమిని కాపాడుకునేందుకు జేడీఎస్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య, పరమేశ్వర, డీకే శివకుమార్‌లలో ఎవరో ఒకరిని సీఎం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అసమ్మతి ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేందుకు శివకుమార్ ప్రయత్నాలు మరింత తీవ్రం చేశారు.

కర్నాటకం : క్లైమాక్స్‌కు చేరుకున్న కన్నడ రాజకీయం.. మరికాసేపట్లో తేలనున్న కుమారస్వామి భవితవ్యం..కర్నాటకం : క్లైమాక్స్‌కు చేరుకున్న కన్నడ రాజకీయం.. మరికాసేపట్లో తేలనున్న కుమారస్వామి భవితవ్యం..

Shivakumar Hints at Appointing Congress CM to Save Karnataka Coalition

శివకుమార్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను సీఎంగా ఎన్నుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జేడీఎస్ అధినేత దేవెగౌడ సైతం ఆయన వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మరోవైపు సినియారిటీ, ముఖ్యమంత్రిగా అనుభవమున్న సిద్ధరామయ్య పేరును కొందరు ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర కూడా రేసులో ఉన్నా శివకుమార్, సిద్ధరామయ్యల్లో ఒకరికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.

English summary
In a major twist, Congress' trouble-shooter and senior minister DK Shivakumar on Sunday said that the JDS is ready to sacrifice for the coalition, adding they want either Siddaramaiah, G Parameshwara or Shivakumar himself to be the chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X