2003 నాటి కేసులో... పాప్ సింగర్ దలేర్ మెహందీకి 2 ఏళ్ల జైలుశిక్ష!
Recommended Video

న్యూఢిల్లీ: ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ దలేర్ మెహందీకి శుక్రవారం పాటియాలా కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. మానవ అక్రమ రవాణా కేసులో కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. 2003లో దలేర్ మెహందీ, అతని సోదరుడు షంషేర్ సింగ్‌లపై ఈ మేరకు కేసు నమోదుకాగా, ఈ కేసులో కోర్టు శుక్రవారం తుదితీర్పు ప్రకటించింది.
తన మ్యూజికల్ ట్రూప్ విదేశాల్లో చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా కొంత మందిని అక్రమంగా విదేశాలకు తీసుకెళ్లినట్టుగా దలేర్ మెహందీ, అతని సోదరుడు షంషేర్ సింగ్‌లపై కేసు నమోదైంది. యూఎస్, యూకే, కెనడాలతో పాటు మరికొన్ని దేశాలకు దలేర్ మనుషులను తీసుకెళ్లినట్టుగా ఆరోపణలు వచ్చాయి.

1998, 1999 సంవత్సరాల్లో దలేర్ మెహందీ తన ట్రూప్‌తోపాటు మరో 10 మంది వ్యక్తులను విదేశాలకు తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. వారిలో ముగ్గురు యువతులు కూడా ఉన్నారు. వారిని చట్టవిరుద్ధంగా శాన్‌ఫ్రాన్సిస్కోలో వదిలేశారు. అలాగే మరో ముగ్గురు బాలురను కూడా ఇదే మాదిరిగా న్యూజెర్సీలో వదిలేశారు.
దలేర్ అతడి తమ్ముడు వారి నుంచి డబ్బులు తీసుకుని చట్టవిరుద్ధంగా వారిని ఆయా దేశాలకు తీసుకెళ్లి అక్కడ వదిలేసి వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దలేర్ మెహందీ, అతడి సోదరుడిపై భక్షీస్ సింగ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాటియాలా పోలీసులు వారిని అరెస్టు కూడా చేశారు.
ఆ తరువాత దలేర్ మెహందీకి వ్యతిరేకంగా 35కుపైగా కేసులు నమోదు అయ్యాయి. పాటియాలా పోలీసులు అరెస్ట్ అనంతరం బెయిల్‌పై విడుదలైనప్పటికీ ఆయా కేసుల్లో ఇన్నేళ్లుగా దలేర్ విచారణను ఎదుర్కొంటూ వస్తున్నారు.
అయితే 2006లో పాటియాలా పోలీసులు దలేర్ మెహందీకి అనుకూలంగా.. రెండు డిశ్చార్జి పిటిషన్లు వేశారు. ఆయన అమాయకుడంటూ వారు పేర్కొన్నాకానీ కోర్టు ఒప్పుకోలేదు. ఆయనపై విచారణకు సరిపడా సాక్ష్యాలు ఉన్నాయంటూ పేర్కొంది.
ఈ కేసులో తాజాగా పాటియాలా కోర్టు దలేర్ మెహందీని దోషిగా తేల్చింది. ప్రస్తుతం దలేర్‌తో పాటు ఆయన సోదరుడు షంషేర్ సింగ్ కూడా పాటియాలా కోర్టు కస్టడీలో ఉన్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications