లవ్: పెళ్లి, చెన్నై ప్రియురాలి దగ్గర రూ. 10 లక్షలు తీసుకున్న బెంగళూరు టెక్కీ, చివరికి !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: పెళ్లి చేసుకుంటానని ప్రియురాలిని నమ్మించి ఆమె దగ్గర రూ. 10 లక్షలు తీసుకుని చివరికి పెళ్లి చేసుకోను, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ అందరి ముందు అమ్మనాబూతులు తిట్టిన సాఫ్ట్ వేర్ ఇంజనీరును చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు.

చెన్నైలోని ఎంజీఆర్ నగర్ లోని పెరియార్ వీధికి చెందిన మోహన్ (27) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఎంజీఆర్ నగర్ లోని పెరియార్ వీధిలో నివాసం ఉంటున్న 27 ఏళ్ల యువతి, మోహన్ కాలేజ్ లో కలిసి చదువుకున్నారు.

మోహన్ బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. తన కాలేజ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంటానని మోహన్ నమ్మించాడు. ఆమెకు మాయమాటలు చెప్పి రూ. 10 లక్షలు తీసుకున్నాడు. ప్రియురాలి దగ్గర తీసుకున్న రూ. 10 లక్షలతో మోహన్ తన చెల్లి పెళ్లి చెయ్యడానికి సిద్దం అయ్యాడు.

Software Engineer arrested in Chennai

విషయం తెలుసుకున్న ప్రియురాలు మొదట మనం పెళ్లి చేసుకుందామని, తరువాత మీ చెల్లి పెళ్లి చేద్దామని మోహన్ కు చెప్పింది. అందుకు మోహన్ నిరాకరించాడు. నా దగ్గర తీసుకున్న రూ. 10 లక్షలు తిరిగి ఇవ్వాలని ప్రియురాలు మోహన్ కు చెప్పింది.

రూ. 10 లక్షలు కాదుకదా ఒక్క రూపాయి కూడా ఇవ్వనని, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ నడి బజారులో ప్రియురాలిని అమ్మనాబూతులు తిట్టాడు. ఆవేదన చెందిన ప్రియురాలు అశోక్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మోహన్ ను అరెస్టు చేసి సైదాపేట కోర్టులో హాజరుపరిచారు. రెండు రోజులు విచారణ చెయ్యడానికి మోహన్ ను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bengaluru Software Engineer arrested in Chennai.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X