బరితెగించిన పాక్ మార్చిలో 100సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘన
శ్రీనగర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భారత భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడింది. పూంచ్ సెక్టార్ లోని షాపూర్ ఏరియాలో జరిగిన ఈ ఘటనలో హరి వాకర్ అనే జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్మీ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఒక్క వారంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. గురువారం సైతం సుందర్‌బనీ సెక్టార్‌లో పాక్ జరిపిన కాల్పుల్లో యశ్ పాల్ అనే జవాన్ అమరుడయ్యాడు. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన పాక్ ఆదివారం ఉదయం వరకు కాల్పులు కొనసాగించింది.
మార్చ్‌లో 100 సార్లు ఒప్పంద ఉల్లంఘన













Click it and Unblock the Notifications