వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్‌తో సంబంధాలున్నట్లు.., ఏదో తెలియని ప్లాన్: శ్రీశాంత్, భజ్జీపై..

తనను మళ్లీ క్రికెట్‌ ఆడనివ్వకపోతే బీసీసీఐను కోర్టుకు ఈడుస్తానని, తనకు ఇప్పటివరకు ఎలాంటి సస్పెన్షన్‌ పత్రం కానీ మెయిల్‌ కానీ రాలేదని చెప్పాడు.

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: తాను అరెస్టైన రోజు అసలు తాగలేదని, అప్పుడు గాయంతో తిరిగి వస్తున్నానని, తాను తాగి ఉన్నానని పోలీసులే తప్పుడు కథనాలు సృష్టించారని, తనను అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు అరెస్ట్ వారెంట్ కూడా లేదని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

అంటే, పోలీసులు తనను కిడ్నాపా చేశారనే చెప్పాలన్నాడు. అధికారిక అరెస్ట్ కాదని, విచారణ నిమిత్తం తనను ఢిల్లీకి తీసుకెళ్తున్నట్లు చెప్పారని, బెట్టింగ్ ప్రస్తావన రాలేదన్నాడు. ఢిల్లీకి వెళ్లాక విషయం అర్థమైందని చెప్పాడు.

ఒకవేళ తాను తాగి ఉంటే జరిగిందంతా తనకు అర్థమయ్యేది కాదన్నాడు. తన ఫోను లాగేసుకుని, నన్నో ఉగ్రవాదిలా చూశారని, చుట్టూ 70 మంది కమాండోలు ఉన్నారని, అదేదో అంతర్జాతీయ క్రిమినల్స్‌ అయినట్లు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల్లో తీసుకెళ్లారన్నాడు.

పన్నెండు రోజుల రిమాండ్‌ తర్వాత తనను తీహార్‌ జైలుకు తీసుకు వెళ్లారని, అందులో 450 మంది క్రిమినల్స్‌తో కలిసి ఉండాల్సి వచ్చిందని, ఇరవై ఏడు రోజుల పాటు జైలులో ఉన్నానని, అది నరకయాతనే అన్నాడు.

దావూద్‌తో సంబంధాలున్నట్లు..

దావూద్‌తో సంబంధాలున్నట్లు..

దావూద్‌ ఇబ్రహీంతో తనకేదో సంబంధాలు ఉన్నట్లు, మనీ లాండరింగ్‌ గురించి ఏవేవో మాట్లాడుకున్నారని చెప్పాడు. వారి దగ్గర ఉన్న ఓ సంభాషణ టేప్‌ని తామిద్దరి సంభాషణగా పేర్కొన్నారని, తన గొంతు పరీక్షించారని చెప్పాడు. అందులో విజయం తననే వరించిందని చెప్పాడు. తనకు విరుద్ధంగా వారి వద్ద రుజువులు లేకపోయాయని చెప్పాడు.

 చాలా భయపడ్డా

చాలా భయపడ్డా

జైలుకెళ్లిన 27వ రోజున తనకు బెయిల్‌ వచ్చిందని, వెంటనే ఇంటికి వెళ్లానని చెప్పాడు. తాను చాలా భయపడ్డానని, రెండు నెలల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు తెలిపాడు. తన తండ్రికి గుండె ఆపరేషన్‌ అయిందని, అమ్మ చాలా కుంగిపోయిందని చెప్పాడు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా తనను అనుమానించడం బాధించిందన్నాడు. కేసు నుంచి రెండేళ్ల తర్వాత బయటపడ్డానని చెప్పాడు.

యాక్షన్ తీసుకుంటా

యాక్షన్ తీసుకుంటా

తనను మళ్లీ క్రికెట్‌ ఆడనివ్వకపోతే బీసీసీఐను కోర్టుకు ఈడుస్తానని, తనకు ఇప్పటివరకు ఎలాంటి సస్పెన్షన్‌ పత్రం కానీ మెయిల్‌ కానీ రాలేదని చెప్పాడు. తనను జీవితకాలం పాటు నిషేధించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని, కాబట్టి మళ్లీ క్రికెట్‌ ఆడుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. క్రికెట్‌కి సంబంధించి ఆ రోజు తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే అన్నాడు.

ఏదో ప్లాన్ ఉంది

ఏదో ప్లాన్ ఉంది

తాను క్రికెట్‌ ఎలా ఆడతానో అందరికీ తెలుసునని, గిల్‌క్రిస్ట్‌, షాన్‌ మార్ష్‌ల గురించీ అందరికీ తెలుసునని, తాను ఆ రోజు అలా చేసి ఉంటే ఆ రోజే తనను అరెస్టు చేయాల్సిందని చెప్పాడు. దీని వెనక తనకు తెలియని ఏదో ప్లాన్‌ ఉందని, అందుకే అలా చేశారన్నాడు.

హర్భజన్ పైన..

హర్భజన్ పైన..

2008లో హర్భజన్‌ నాపై చేయిచేసుకున్నాడన్నది మీడియా పెద్దది చేసి చూపించిందన్నాడు. అది అసలు కొట్టడం కాదని, ఇప్పటికీ తాను భజ్జీపా అని పిలుస్తుంటానని, కానీ మీడియా తనపై ఏవేవో సృష్టించిందని, హర్భజన్‌ అప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్నాడని, ఒత్తిడిలో చాలా చిరాగ్గా ఉన్నాడని, తాను అప్పుడు కింగ్‌ ఎలెవన్ పంజాబ్‌ తరఫున ఆడుతున్నాడని చెప్పాడు. మ్యాచ్‌ పూర్తయ్యాక భజ్జీ వద్దకు వెళ్లి హార్డ్‌ లక్‌ అని చెప్పానని, దాంతో భజ్జీ చేత్తో తనను తోశాడని, అప్పుడు భావోద్వేగం పట్టలేక ఏడ్చానని, తాను త్వరగా ఉద్వేగానికి లోనవుతానని, ఆ తర్వాత వారితో గొడవపడాలని కూడా అనుకోలేదని చెప్పాడు. అన్నీ మర్చిపోయి ఇప్పుడు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నానని చెప్పాడు.

English summary
Sreesanth talks about betting and Bajji issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X