వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'స్టార్టప్' సరికొత్త ఆలోచన: ఏటీఎంల వద్ద క్యూ కోసం హెల్పర్, గంటకు రూ.90

ఢిల్లీకి చెందిన స్టార్టప్.. 'బుక్ మై చోటు' ఏటీఎంల వద్ద క్యూలో నిలుచునేందుకు సహాయకులను అందిస్తోంది. ఇందుకు గంటకు రూ.90 తీసుకుంటున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన ప్రకటన చేసిన అనంతరం నోట్ల మార్పిడికి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో క్యూలో నిలబడే వారి కోసం ఓ స్టార్టప్ ముందుకు వచ్చింది.

ఢిల్లీకి చెందిన స్టార్టప్.. 'బుక్ మై చోటు' ఏటీఎంల వద్ద క్యూలో నిలుచునేందుకు సహాయకులను అందిస్తోంది. ఢిల్లీ - ఎన్‌సిఆర్ వద్ద ఈ సహాయకులను అందిస్తోంది. ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద వరుస కట్టేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తోంది.

Startup provides helper to stand in ATM queue at ₹90/hr

అయితే, ఇందుకు గంటకు రూ.90 తీసుకుంటున్నారు. సహాయకులు లోపలి దాకా వెళ్లరు. క్యూ లైన్ దగ్గరికి వెళ్లే దాకా నిలబడతారు. ఆ తర్వాత ఎవరికైతే డబ్బులు కావాలో వాళ్లు వెళ్తారు. కేవలం వారు క్యూలో మాత్రమే నిలుచుంటారు. ఈ స్టార్టప్ క్లీనింగ్, షిఫ్టింగ్, గ్రాసరీ షాపింగ్ కోసం కూడా సహాయకులను అందిస్తోంది.

రూ.500, రూ.1000 నోట్లు రద్దు ప్రకటన అనంతరం సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. క్యూలో నిలుచొని రద్దైన నోట్లతో కొత్త వాటిని మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు గంటకు రూ.90 తీసుకొని సహాయకులను నియమించే స్టార్టప్ వెలుగు చూసింది.

ఇక, బ్లాక్ మనీ ఉన్న వాళ్లు వివిధ పద్ధతుల్లో తమ వద్ద ఉన్న డబ్బును మార్చుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తోన్న విషయం తెలిసిందే. మొదట బంగారం కొనడం, ఆ తర్వాత నగదును డాలర్లలోకి మార్చుకోవడం.. ఇలా వివిద పద్ధతులు వినియోగించారు. ప్రభుత్వం అన్నింటి పైన దృష్టి సారించింది.

English summary
A Delhi-based startup called 'Book My Chotu' is providing helpers in Delhi-NCR for standing in the ATM or bank queues for its users at ₹90 per hour. The helpers will not go inside the bank or ATM, and will just stand in the queue for the customers. The startup also provides on-demand helpers for cleaning, shifting and grocery shopping.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X