ఒకే బెంచ్‌పై రిక్షా డ్రైవర్ బిడ్డ.. సుప్రీంకోర్టు జడ్జి బిడ్డ!
"ఒకే బెంచ్‌పై రిక్షా డ్రైవర్ బిడ్డ.. సుప్రీంకోర్టు జడ్జి బిడ్డ! సౌభ్రాతృత్వానికి తరగతి గదే పాఠశాల" భారతీయ విద్యా విధానంపై దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం ఇది. ఆర్థిక స్థితి ఆధారంగా పిల్లల మధ్య కడుతున్న గోడలు, ప్రస్తుత వాతావరణలో ప్రాథమిక విద్య పిల్లలకు అందుతున్న తీరుపై సుప్రీం ధర్మాసనం చేపట్టిన విచారణలో న్యాయమూర్తులు చేసిన కామెంట్స్ పేదవాడి ముఖంలో ఆనందం కలిగేలా చేసింది.
భారత రాజ్యాంగంలో సౌభ్రాతృత్వం అనే పదం కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, తరగతి గదిలో నిజంగా కనిపించాలంటూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక రిక్షా కార్మికుడి బిడ్డ, శతకోటీశ్వరుడి బిడ్డ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిడ్డ కలిసి ఒకే బెంచ్‌పై కూర్చుని చదివుకున్నప్పుడే సమానత్వానికి అర్థం ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఆలోచనకు చట్టబద్ధమైన బలం చేకూరుస్తూ, విద్యా హక్కు చట్టం (RTE)లోని 25 శాతం ఉచిత సీట్ల నిబంధనను అన్ని పాఠశాలలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.

ఇది సామాజిక వ్యవస్థ ఫలితం..
కులం, మతం,ఆర్థిక స్థితి ఆధారంగా పిల్లల మధ్య గోడలు కట్టకుండా, ఒతే వాతావరణంలో ప్రాథమిక విద్య అందించడమే ఆర్టీఈ చట్టం యొక్క అసలు లక్ష్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్య అనేది కేవలం చదువు మాత్రమే కాదు, సమాజాన్ని సమానంగా మలిచే శక్తివంతమైన సాధనమని కోర్టు గుర్తు చేసింది. ''శతకోటీశ్వరుడి బిడ్డ అయినా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిడ్డ అయినా, ఆటో డ్రైవర్ బిడ్డైనా, వీధి వ్యాపారి బిడ్డ అయినా.. అందరూ ఒకే తరగతిలో చదవాల్సిందే. ఇది యాదృచ్ఛికం కాదు, చట్టబద్ధంగా నిర్మించబడిన సామాజిక వ్యవస్థ ఫలితం'' అని జస్టిస్ నరసింహ తీర్పులో పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛలతో పాటు సౌభ్రాతృత్వం కూడా రాజ్యాంగ స్తంభమేనని, సెక్షన్ 12 ఆ సూత్రాన్ని జీవితం లోకి తీసుకువస్తోందని వ్యాఖ్యానించారు.
సామాజిక విలువ..
సౌభ్రాతృత్వం అమలుకాని ఆదర్శమనే భావనను ధర్మాసనం తీవ్రంగా తిరస్కరించింది. వ్యక్తిగత హక్కులైన సమానత్వం, స్వేచ్ఛలతో పోలిస్తే, సౌభ్రాతృత్వం అనేది సంబంధాలపై ఆధారపడిన సామాజిక విలువ అని వివరించింది. ఒకే తరగతి గదిలో, ఒకే పాఠ్యాంశాలతో చదువుకునే పిల్లలు క్రమంగా తమ కుల, వర్గ గుర్తింపులను మించి, ఐక్యతా బంధాలను నిర్మించుకుంటారని కోర్టు అభిప్రాయపడింది.
పిల్లల సంపూర్ణ అభివృద్ధి..
ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను కల్పించడం కేవలం సంక్షేమ చర్య మాత్రమే కాదని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఎ, ఆర్టికల్ 39(ఎఫ్)లలో ప్రతిఫలించిన 'పిల్లల సంపూర్ణ అభివృద్ధి' లక్ష్యానికి నేరుగా అనుసంధానమై ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అన్ని వర్గాల పిల్లలకు ఒకే పాఠశాల వ్యవస్థలో సమాన విద్య అందించాలన్న కొఠారి కమిషన్ సూచనలను ఈ తీర్పు మళ్లీ గుర్తుకు తెచ్చింది.
ఈ నిబంధన అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమని భావించిన ధర్మాసనం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), రాష్ట్ర కమిషన్లు మరియు సలహా మండలిలతో సంప్రదించి, ఆర్టీఈ చట్టం కింద అవసరమైన నియమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు వివరాలను మార్చి 31లోగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 6న చేపట్టనున్నట్లు కోర్టు వెల్లడించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications