వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12మందితో గర్ల్‌పై రేప్ చేయించారు: సుమోటోగా సుప్రీం

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Supreme Court
న్యూడిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఓ యువతి పైన 12 మందితో అత్యాచారం చేయించిన సంఘటనను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా పరిగణించింది. ఈ ఘటనపై వారం లోగా నివేదిక ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, పశ్చిమ బెంగాల్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బిర్భూమ్ జిల్లాలో 20 ఏళ్ల యువతిపై 12 మందితో సామూహిక అత్యాచారం చేయించిన సంఘటన నిన్న వెలుగులోకి వచ్చింది. మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడితో సంబంధం పెట్టుకుందనే ఆరోపణపై గ్రామ కంగారూ కోర్టు తీర్పు మేరకు ఆ యువతిపై 12 మంది సామూహిక అత్యాచారం జరిపారు.

పశ్చిమ బెంగాల్ రాజధానికి 150 కిలోమీటర్ల దూరంలో గల బిర్భూమి జిల్లాలోని సుబాల్పూర్ గ్రామంలో ఈ అత్యంత సిగ్గుచేటైన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. అమ్మాయిని రెండు వేల రూపాయల జరిమానా విధించాలని గ్రామానికి చెందిన పెద్దల కోర్టు ఆదేశించింది.

ఆ మొత్తం చెల్లించలేమని కుటుంబం చెప్పడంతో ఆ యువతిపై సామూహిక అత్యాచారం చేయాలని గ్రామ పెద్ద ఆదేశించాడు. ఆ సంఘటనపై ఆ గిరిజన యువతి లాభ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను చికిత్స నిమిత్తం సూరిలోని ఆస్పత్రికి పంపించారు. గ్రామానికి చెందిన 13 మందిపై యువతి ఫిర్యాదు చేసింది.

వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అసిస్టెంట్ పోలీసు సూపరింటిండెంట్ ప్రశాంత చౌదరి చెప్పారు.

English summary
In yet another horrific incident, a twenty-year-old woman was allegedly gang-raped in West Bengal's Birbhum district by at least twelve men, reportedly, on the orders of a village kangaroo court that decided to punish her for having a relationship with a boy from a different community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X