రచయిత్రి మృతి: సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చిక్కులు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ఓ ట్వీట్ చర్చకు దారి తీసింది. ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి మహాశ్వేతా దేవి గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెకు పలువురు నివాళులు అర్పించారు. సుష్మ కూడా నివాళులు అర్పిస్తూ ట్వీట్‌ చేశారు.

అయితే ఆమె కొంత పొరబడ్డారు. దీంతో అది తంటాలు తెచ్చిపెట్టింది. మహాశ్వేతా దేవి కన్నుమూసిన వార్త తెలియగానే సుష్మ ఆమెకు నివాళులర్పిస్తూ ట్వీట్‌ చేశారు. వెంటనే మరో ట్వీట్‌లో ఆమె రచించిన ప్రథమ్‌ ప్రతిశ్రుతి, బకుల్‌కథ పుస్తకాలు తన జీవితంపై చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు.

 Sushma Swaraj condoles death of Mahasweta Devi, but with wrong books

మొదటి ట్వీట్‌ బాగానే ఉన్నప్పటికీ, రెండో ట్వీట్‌తో సుష్మాస్వరాజ్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే, మహాశ్వేతా దేవి రచించారంటూ సుష్మ ట్విట్టర్లో పేర్కొన్న రెండు పుస్తకాలను ఆమె రాయలేదు. వాటిని మరో రచయిత్రి ఆశాపూర్ణా దేవి రాశారు. దీంతో ఈ ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. పొరబాటు గ్రహించిన సుష్మ వెంటనే రెండో ట్వీట్‌ను తొలగించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As the news of social activist and writer Mahasweta Devi’s demise spread, many dignitaries and political leaders took to Twitter to express condolence and pay homage.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X