శుభవార్త: ఆధార్‌కు బదులుగా వర్చువల్ ఐడీ నెంబర్, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆధార్ వెబ్‌సైట్ నుండి 16 అంకెల సంఖ్యను సృష్టించుకునేందుకు అవకాశం కల్పించింది యూఐడీఏఐ.వ్యక్తిగత గోప్యతకు విఘాతం కలుగుతుందని భావించేవారికి భరోసా కల్పించేందుకు యూఐడిఏఐ సరికొత్త విధానాన్ని ప్రవేశ పెట్టనుంది.16 అంకెల వర్చువల్ ఐడీనీ క్రియేట్ చేసుకొనే వెసులుబాటును కల్పించింది.

వ్యక్తిగత గోప్యతకు విఘాతం కలుగుతుందని ఆందోళన చెందేవారికి వర్చువల్ ఐడీలను క్రియేట్ చేసుకొనే వెసులుబాటును యూఐడీఏఐ కల్పించనుంది. ఆధార్ కార్డు హోల్డర్లు యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి 16 అంకెల సంఖ్యను సృష్టించుకునేందుకు అవకాశం కల్పించింది.

ఈ కొత్త గుర్తింపు సంఖ్యను వర్చువల్ ఐడీ అని పిలుస్తారు. దీనితోపాటు వినియోగదారుడి బయోమెట్రిక్స్ ఏదైనా అధీకృత సంస్థకు ఇచ్చినపుడు, ఆ సంస్థకు వినియోగదారుని పేరు, చిరునామా, ఫొటో వంటి పరిమిత వివరాలు మాత్రమే అందుతాయి.

 Temporary 16-Digit Virtual ID To Secure Aadhaar Data Privacy: 10 Points

ఒక్కొక్క వినియోగదారుడు ఒకటి కన్నా ఎక్కువ వర్చువల్ ఐడీలను సృష్టించుకోవచ్చు. అయితే తాజాగా ఒక వర్చువల్ ఐడీని క్రియేట్ చేసినపుడు అంతకుముందు క్రియేట్ చేసిన వర్చువల్ ఐడీ పోతుంది.

వర్చువల్ ఐడీతో పాటు లిమిటెడ్ కేవైసీ అనే విధానాన్ని కూడా యూఐడీఏఐ పరిచయం చేసింది. టెలికామ్ వంటి సేవలను అందజేసే సంస్థల వినియోగదారుల వివరాలను అవసరం మేరకు మాత్రమే ఆ సంస్థలకు అందజేయడమే ఈ విధానం ముఖ్యోద్దేశం.

వర్చువల్ ఐడీని మార్చి 1 నుంచి అంగీకరిస్తారు. వర్చువల్ ఐడీ అనేది తాత్కాలిక సంఖ్య మాత్రమే. దీనిని ఆధార్ సంఖ్యగల వ్యక్తి తనకు నచ్చినపుడు మార్చుకోవచ్చు. కొత్తగా మరొక వర్చువల్ ఐడీని క్రియేట్ చేసుకోవచ్చు.

జూన్ 1 నుంచి అన్ని సంస్థలు తమ యూజర్ల వర్చువల్ ఐడీలను తప్పనిసరిగా అంగీకరించాలి. దీనికోసం అవసరమైన మార్పులు చేయడంలో విఫలమయ్యే సంస్థలపై ఆర్థికపరమైన చర్యలు తీసుకుంటారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Virtual Aadhaar ID system is aimed at minimising instances of leak, and misuse of Aadhaar numbers and enhancing privacy of the 119 crore people issued the identification number

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి