దావూద్.. కేంద్రంతో టచ్ లోనే ఉన్నాడు: ఫేస్‌బుక్‌లో రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
1993 ముంబై పేలుళ్ల నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇండియాకు తిరిగి వచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చ
ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారి ఫేస్‌బుక్‌లోకి వచ్చిన ఆయన.. ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు.
1993 ముంబై పేలుళ్ల నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇండియాకు తిరిగి వచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడని రాజ్ థాకరే తెలిపారు. అంతేకాదు అతన్ని ఇండియాకు తీసుకొచ్చి ఇది తమ విజయంగా బీజేపీ చెప్పుకొనే ప్రయత్నం చేయనుందని కూడా ఆయన చెప్పారు.

257 మంది మృతికి కారణమైన ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్.. అప్పటి నుంచి పాకిస్తాన్‌లోని కరాచీలో తలదాచుకుంటున్నాడు. మూడు ఖండాల్లోని 12 దేశాల్లో అతని నెట్‌వర్క్ విస్తరించి ఉంది.
ఫేస్‌బుక్‌లోకి ఇవాళే ఎంటరైన రాజ్ థాకరే.. బీజేపీపై మరిన్ని ఆరోపణలు చేశారు. ఈవీఎంలను బీజేపీ రిగ్ చేసిందని కూడా ఆరోపించారు. ప్రతి ఓటు బీజేపీకి వెళ్తుంటే.. ఎన్నికల్లో పోటీ చేసి లాభం లేదని ఆయన అన్నారు.
థాకరే ఫేస్‌బుక్‌లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన ప్రొఫైల్‌కు 4.39 లక్షల లైక్స్, 4.43 లక్షల మంది ఫాలోవర్లు రావడం విశేషం. పార్టీ కార్యకర్తలతో టచ్‌లో ఉండటానికే ఫేస్‌బుక్‌లోకి వచ్చినట్లు థాకరే చెప్పారు.
-
ఈ సాయంత్రం మోదీ అత్యవసర భేటీ- కఠిన నిర్ణయాల దిశగా కేంద్రం? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications