pieces: ఆ రోజు భార్యతో ఫోన్ లో మాట్లాడారు. బావిలో ముక్కలు ముక్కలుగా శవమైనాడు !
చెన్నై/ సేలం: వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి మృతదేహం తేలింది. ఆప్రాంత ప్రజలు గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక కేంద్రం సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. బావిలోకి దిగి వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించారు. అప్పుడు అక్కడ చూసిన సీన్ తో స్థానిక ప్రజలు, పోలీసులు హడలిపోయారు. బావిలో పడి ఉన్న మృతుడి చేతులు పూర్తిగా తెగిపోయాయి. శరీరం సగం మాత్రమే పడి ఉంది. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఆశవం బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు,
తమిళనాడులోని సేలం జిల్లాలోని తారమంగళం సమీపంలోని కారుకుపట్టి ప్రాంతంలోని వ్యవసాయ బావిలో చిక్కిన శవం లారీ డ్రైవర్ మణి అని పోలీసులు గుర్తించారు. పోలీసులు విచారణలో పెరియసోరగై మట్టుకారన్ వలవు ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ మణికి వివాహమై భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారని వెలుగు చూసింది.

మూడు రోజుల క్రితం మణితో అతని భార్య సెల్ ఫోన్ లో మాట్లాడిందని, తరువాత మణి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని మణి భార్య సమాచారం ఇచ్చిందని పోలీసులు అన్నారు. వ్యవసాయ బావిలో మణి శవం తేలిన విషయం మొదట గుర్తించిన వ్యక్తిని పోలీసులు విచారణ చేస్తున్నారు. మణి రెండు చేతులు నరికేశారని, అతని శరీరాన్ని 2 ముక్కలుగా నరికి అతి కిరాతకంగా హత్య చేశారని పోలీసులు అన్నారు.
వేరే ప్రాంతంలో హత్య చేసి శరీరాన్ని మాత్రం బావిలో విసిరివేసి పరారైనారని, చేతులు మాత్రం చిక్కడం లేదని పోలీసులు అంటున్నారు. మణి శరీరంలోని మరో భాగం, రెండు చేతులు ఎక్కడపడేశారు అనే విషయం అంతు చిక్కడం లేదని, హంతకుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. న్ని ఎక్కడ విసిరారు అనే వివరాలు తెలియరాలేదు. పోలీసులు స్నిఫర్ డాగ్‌ను రంగంలోకి దించారు. మణి మృతదేహం పడి ఉన్న బావికి కొద్ది దూరం వరకు డాగ్స్ వెళ్లి అక్కడ నిలిచిపోయాయి. ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి మణి శరీరంపై వేలిముద్రలు సేకరించి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications