వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళకు మరో దెబ్బ: తెరమీదకు 20 ఏళ్ల నాటి ఫెరా కేసు, జైల్లోనే విచారణ !

బెంగళూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫెరా కేసులో బెంగళూరు జైల్లో ఉన్న శశికళను వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారించాలని మద్రాసు హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ వీకే. శశికళ నటరాజన్ కు మరో కేసు విచారణ వెంటాడుతున్నది.

అక్రమంగా విదేశాలకు నగదు ఎగుమతి చెయ్యడం, దిగుమతి చెయ్యడం చట్ట ప్రకారం నేరం. ఈ నియమాలు ఉల్లంఘించి నగదు లావాదేవీలు చేశారని ఆరోపిస్తూ గత 20 సంవత్సరాల క్రితం వీకే. శశికళ నటరాజన్ తదితరుల మీద కేసు నమోదు అయ్యింది.

శశికళ కూడా

శశికళ కూడా

నియమాలు ఉల్లంఘించి విదేశీ నగదు లావాదేవీలు జరిగాయని ఆరోపిస్తూ 20 ఏళ్ల క్రితం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసింది. ఈ కేసులో శశికళతో పాటు ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్ తదితరులు కూడా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

 ఆమెను విచారణ చెయ్యాలి

ఆమెను విచారణ చెయ్యాలి

విదేశీ నగదులావాదేవీల కేసులో శశికళ నటరాజన్ ను విచారించాలని ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మద్రాసు హైకోర్టులో అర్జీ సమర్పించారు. ఫెరా కేసులో వీకే శశికళ నటరాజన్ ను విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు.

 దినకరన్ రావాల్సిందే

దినకరన్ రావాల్సిందే


చెన్నైలోని మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు (ఆర్థిక నేరాలు)లో ఫెరా కేసు విచారణలో ఉంది. ఫెరా కేసు విచారణకు కచ్చితంగా హాజరుకావాలని న్యాయస్థానం ఇప్పటికే టీటీవీ దినకరన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే దినకరన్ ను నిందితుడిగా గుర్తించిన న్యాయస్థానం ఆయనకు రూ. 28 కోట్ల అపరాద రుసుం విధించింది.

 శశికళను విచారిస్తారు

శశికళను విచారిస్తారు

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ వ్యక్తిగతంగా ఫెరా కేసు విచారణకు చెన్నై వెళ్లే అవకాశం తక్కువగా ఉందని సమాచారం. ఆమెను వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారించాలని ఈడీ అధికారులు ఇప్పటికే కోర్టులో అర్జీ సమర్పించారు.

శశికళ దోషిగా అయితే తమిళనాడు జైల్లో

శశికళ దోషిగా అయితే తమిళనాడు జైల్లో

ఫెరా కేసులో శశికళ దోషిగా తేలితే బెంగళూరులో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన తరువాత ఆమెను తమిళనాడుకు తరలిస్తారని, అక్కడి జైల్లో ఫెరా కేసులో ఆమె మళ్లీ కోర్టు విధించిన శిక్ష అనుభించాల్సి ఉంటుందని న్యాయనిపుణలు అంటున్నారు.

English summary
The Enforcement Directorate has insisted that Sasikala Natarajan faces trial in a case registered under the Foreign Exchange Regulation Act. This move by the ED comes after the Madras High Court had recently said that Sasikala and the other accused must face trial in the two-decade old case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X