Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: భర్త మొబైల్ ఫోన్ చూసిన కొత్త పెళ్లికూతురు, అమ్మాయిల న్యూడ్ వీడియోలు ?, చెక్కభజన !

చెన్నై/సేలం: యువకుడు అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఓ అమ్మాయితో అతని పెళ్లి జరిపించాలని అనుకున్నారు. అమ్మాయి కూడా అంబులెన్స్ డ్రైవర్ ను పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల పెళ్లి జరిగింది. భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న అంబులెన్స్ డ్రైవర్ ప్రతిరోజు డ్యూటీకి వెళ్లి వస్తున్నాడు. తన భర్త చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నాడని అంబులెన్స్ డ్రైవర్ భార్య అనుకుంది, అనుకోకుండా భార్య ఆమె భర్త మొబైల్ ఫోన్ పరిశీలించింది. అంతే షాక్ గురైన కొత్త పెళ్లికూతురు హడలిపోయింది. మైనర్ అమ్మాయి న్యూడ్ వీడియో కాల్ ఆమె భర్త మొబైల్ ఫోన్ లో రికార్డు చేసిన సీన్లు చూసిన కొత్త పెళ్లికూతురు బిత్తరపోయింది. నా జీవితం ఇంతేనా అనుకోకుండా కొత్త పెళ్లికూతురు ఓఅడుగు ముందుకు వేసింది.

 అంబులెన్స్ డ్రైవర్

అంబులెన్స్ డ్రైవర్

తమిళనాడులోని సేలం జిల్లాలోని వాజప్పాడి సమీపంలోని బేలూరులోని మాతా కోవివిల్ వీధిలో అరవింద్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అరవింద్ రెండు సంవత్సరాల నుంచి ఓ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం అరవింద్ ను పెళ్లి చేసుకోవడానినికి ఓ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల అరవింద్ కు ఆ యువతితో పెళ్లి జరిగింది.

 భార్య సంతోషంగా ఉంది

భార్య సంతోషంగా ఉంది

భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న అంబులెన్స్ డ్రైవర్ అరవింద్ ప్రతిరోజు డ్యూటీకి వెళ్లి వస్తున్నాడు. తన భర్త అరవింద్ ప్రమాదాల్లో గాయపడినవారిని, అనారోగ్యంగా ఉన్న వారి ప్రాణాలు కాపాడుతున్నాడని అంబులెన్స్ డ్రైవర్ అరవింద్ భార్య అనుకుంది, భర్త అరవింద్ కోరికలు అన్నీ తీరుస్తున్న కొత్త పెళ్లి కూతురు కొన్ని రోజుల వరకు హ్యాపీగానే ఉంది.

హడలిపోయిన భార్య

హడలిపోయిన భార్య

అంబులెన్స్ డ్రైవర్ అరవింద్ ను పెళ్లి చేసుకున్న మహిళ ఆమె భర్త మొబైల్ ఫోన్ ను పరిశీలించింది. భర్త మొబైల్ ఫోన్ లో ఏవేవో వెబ్ సైట్ ల లింక్ లు కనపడ్డాయి. తరువాత అరవింద్ మొబైల్ ఫోన్ ను అతని భార్య క్షుణ్ణంగా పరిశీలించింది. భర్త అరవింద్ మొబైల్ లో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి అర్దనగ్నంగా ఉన్న వీడియో చూసిన భార్య హడలిపోయింది. ఆ అమ్మాయి అర్దనగ్నంగా తన భర్త అరవింద్ తో బూతులు మాట్లాడిందని తెలుసుకున్న అంబెలెన్స్ డ్రైవర్ భార్య షాక్ అయ్యింది.

 నా భర్త అమ్మాయిలను టార్గెట్ చేశాడు

నా భర్త అమ్మాయిలను టార్గెట్ చేశాడు

పదవ తరగతి చదువుతున్న అమ్మాయిని తన భర్త అరవింద్ టార్గెట్ చేశాడని అతని భార్య గుర్తించింది, ఇద్దరూ చాలాసార్లు అర్దనగ్నంగా వీడియో కాల్స్ చేసి మాట్లాడుకున్నారని అరవింద్ భార్య తెలుసుకుంది. పదవ తరగతి విద్యార్థినిని లక్ష్యంగా చేసుకున్న తన భర్త అరవింద్ ఆ అమ్మాయిని ప్రేమ ఉచ్చులో పడేశాడని గుర్తించింది. అమ్మాయి సెల్‌ఫోన్ నంబర్‌ ఫోన్ చేసి లవ్ మ్యాటర్ కు సంబంధించి అరవింద్ మాట్లాడుతున్నాడని ఆమె గుర్తించింది. విద్యార్థిని కూడా అరవింద్ మాటలకు మైమరచిపోయి ఏదేదో మాట్లాడిందని తెలుసుకున్న భర్య షాక్ అయ్యింది.

 బలవంతంగా అర్దనగ్నంగా వీడియో కాల్ లో ?

బలవంతంగా అర్దనగ్నంగా వీడియో కాల్ లో ?

ఓ దశలో విద్యార్థినితో అరవింద్ వీడియో కాల్ మాట్లాడాడు. విద్యార్థిని అర్ధనగ్నంగా చూడాలని అరవింద్ పట్టుబట్టాడు. వీడియో రికార్డ్ చేయనని హామీ ఇస్తే మాట్లాడుతానని ఆ అమ్మాయి అరవింద్ కు చెప్పింది. అరవింద్ ఆ అమ్మాయికి ఇంకా రెచ్చగొట్టి ఆమె అర్దనగ్నంగా వీడియో కాల్ చేసేటట్లు చేశాడని వెలుగు చూసింది. విద్యార్థిని అర్ధనగ్నంగా వీడియో కాల్ చేసిన సమయంలో అరవింద్ రహస్యంగా అతని మొబైల్ లో రికార్డు చేసిన దృశ్యాలను అతని భార్య చూసింది.

 భార్య ఏం చేసిందంటే ?

భార్య ఏం చేసిందంటే ?

తన భర్త అరవింద్ మాట్లాడుతున్న పదవ తరగతి అమ్మాయి ఆచూకి తెలుసుకున్న అతని భార్య వెంటనే విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించింది. ఈ సమాచారం విని షాక్‌కు గురైన విద్యార్థిని తల్లిదండ్రులు వాజపాడి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో అంబులెన్స్ డ్రైవర్ అరవింద్ మీద ఫిర్యాదు చేశారు. అరవింద్‌ మీద ఫిర్యాదు రావడంతో ఇన్‌స్పెక్టర్‌ ధనలక్ష్మి పోక్సో చట్టం కింద అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

 ధైర్యం చేసిన భార్య

ధైర్యం చేసిన భార్య

అంబులెన్స్ డ్రైవర్ అరవింద్ ఇంకా ఎవరైనా అమ్మాయిల జీవితాలతో ఇలాగే ఆడుకున్నాడా ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న యువతి తన భర్త అరవింద్ అరెస్టు అయ్యి జైలుకుపోతే తన జీవితం నాశనం అవుతుతందని ఆలోచించకుండా మరో అమ్మాయి జీవితం గురించి ఆలోచించి ధైర్యంగా ఇలాంటి నిర్ణయం తీసుకుందని పోలీసులు అంటున్నారు. అంబులెన్స్ డ్రైవర్ అరవింద్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+